Supreme Court : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం షాక్‌.. ఆ కులాలను ఎస్టీల నుంచి తొలగించాలని పిటిషన్‌పై..

దేశ అత్యున్నత న్యాయస్థానం  కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలోనుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.  ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.

New Update
Supreme Court

Supreme Court

Supreme Court : దేశ అత్యున్నత న్యాయస్థానం  కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలోనుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.  ఈ పిటిషన్‌పై 
సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రంతో పాటు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితూ ఆ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.  హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాల్సిందేనంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

ఇది కూడా చదవండి:సాఫ్ట్‌వేర్ అంటూ మోసం చేసిన పానీపూరీ భర్త.. గర్భవతి అని చూడకుండా దారుణంగా ఏం చేశాడంటే?


 రాష్ర్టంలో ఉన్న లంబాడీ, సుగాలీ, బంజారాలు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా మిగిలిన ఎస్టీ కులాలతో పోలిస్తే  మెరుగైన స్థానంలో ఉన్నారని ఆ పిటీషన్‌లో తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. అలాంటి 
వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల అన్ని రకాలుగా వెనుకబడిన కోయ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఇచ్చే సమాధానాన్ని బట్టి తిరిగి విచారణ జరిపే అవకాశం ఉంది.

ఇది కూడా చూడండి:CM Revanth Reddy : మేడిగడ్డ కూలింది. ఎల్లంపల్లే మనకు దిక్కు..సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు