Summer Holidays 2025 : స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చేశాయ్. ఎప్పటినుంచి అంటే?

తెలంగాణలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేసవి సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల కోసం వేసవి సెలవుల తేదీలను అధికారికంగా ప్రకటించింది.

New Update
Summer Holidays 2025

Summer Holidays 2025

Summer Holidays 2025 : తెలంగాణలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేసవి సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల కోసం వేసవి సెలవుల తేదీలను అధికారికంగా ప్రకటించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సెలవులు ఎప్పుడు మొదలవుతాయన్న ఉత్కంఠకు ఈ ప్రకటనతో తెరపడింది.ఇటీవల కాలంలో సోషల్ మీడియా, కొన్ని వర్క్‌షాపుల ద్వారా వేసవి సెలవులపై వివిధ రకాల ప్రచారాలు జరిగాయి. కొన్ని కథనాల్లో ఏప్రిల్ మొదటి వారం నుంచే సెలవులు అని ప్రచారం చేయగా, మరికొన్ని మేలో సెలవులు ఉంటాయని పేర్కొన్నాయి. దీంతో గందరగోళానికి లోనైన విద్యార్థులు, తల్లిదండ్రులలో అసమాధానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన చేస్తూ తుది షెడ్యూల్‌ను విడుదల చేసింది.

పాఠశాలలకు సెలవుల తేదీలు ఇవే


తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన విద్యా సంవత్సరపు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, 2025 ఏప్రిల్ 24వ తేదీ నుండి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు అమలులో ఉండనున్నాయి. పాఠశాలలు జూన్ 12, 2025న మళ్లీ ప్రారంభమవుతాయి. అంటే మొత్తం 46 రోజులపాటు విద్యార్థులు సెలవులను ఆస్వాదించనున్నారు.వీటితో పాటు, ఏప్రిల్ 23 లోపు అన్ని పాఠశాలలలో వార్షిక పరీక్షలు పూర్తవుతాయని, అదే రోజు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు ఏప్రిల్ 24నుంచి తాత్కాలికంగా మూసివేయబడుతాయని తెలియజేశారు.

Also Read :  పోలీసులకు చిక్కిన అఘోరీ-శ్రీవర్షిణీ.. తెలంగాణకు పయణం!

జూనియర్ కళాశాలలకు ప్రత్యేక షెడ్యూల్

ఇంతకు ముందు, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) తన ఆధీనంలో ఉన్న అన్ని జూనియర్ కళాశాలల సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం, ఇంటర్మీడియట్ కళాశాలలకు 2025 మార్చి 31న నుండి వేసవి సెలవులు ప్రారంభమవుతాయని, అవి జూన్ 1, 2025 వరకు కొనసాగుతాయని తెలిపింది. కళాశాలలు జూన్ 2న మళ్లీ ప్రారంభమవుతాయి. దీని ప్రకారం, ఇంటర్ విద్యార్థులకు 62 రోజుల విరామం లభించనుంది.

టూర్స్ కు రెడీ

వేసవి సెలవుల ప్రకటనతో పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు సెలవుల సమయంలో కుటుంబ సమేతంగా పర్యటన ప్రదేశాలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొంది స్తున్నారు. “ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే సెలవులు మొదలవ్వగా, తెలంగాణలో ఆలస్యంగా ప్రకటిస్తారేమో అనే సందేహం ఉంది. కానీ ఇప్పుడు స్పష్టత వచ్చింది. పిల్లలతో కలిసి హిల్ స్టేషన్‌కు వెళ్లాలనే ఉద్దేశంతో ముందే బుకింగ్స్ కూడా చేసుకున్నాం,” అంటూ ఒక తల్లి స్పందించారు.

Also Read :  ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!

సెలవులను సద్వినియోగం చేసుకుంటే..

వేసవి సెలవులు ఉపాధ్యాయులకు కూడా విశ్రాంతి కలిగించనున్నాయి. గత నెలలుగా పరీక్షల నిర్వహణ, మూల్యాంకనాలతో బిజీగా గడిపిన ఉపాధ్యాయులు ఇప్పుడు తమ కుటుంబాలతో సమయం గడిపే అవకాశాన్ని పొందబోతున్నారు. విద్యా సంవత్సరం సజావుగా పూర్తయినందుకు చాలామంది ఉపాధ్యాయులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.వేసవి సెలవులు విద్యార్థుల కోసం విరామంతో పాటు అభివృద్ధికి దోహదపడే సమయంగా మారవచ్చు. కొందరు విద్యార్థులు ఈ సమయంలో క్రియేటివ్ కోర్సులు, ఆర్ట్స్, స్పోర్ట్స్ క్యాంపులు, ఒళ్లు విరగకుండా సెలవులు గడిపే అవకాశాలను ఆస్వాదించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇతరులు కుటుంబ సభ్యులతో కలిసి పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలోని పాఠశాలలు వార్షిక పరీక్షల నిర్వహణలో నిమగ్నమై ఉన్నాయి. ఏప్రిల్ 23వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. కొన్ని పాఠశాలలు పరీక్ష ఫలితాలను అదే రోజు లేదా కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నాయి. ఈ పరీక్షల అనంతరం వెంటనే వేసవి సెలవులు ప్రారంభమవుతాయి.

Also Read :  అడ్డంగా బుక్కైన మణుగూరు CI.. ఏసీబీకి ఎలా దొరికాడంటే?

విద్యా సంవత్సరం ప్రారంభం ఎప్పుడు?

వేసవి సెలవులు ముగిశాక, 2025 జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అదే విధంగా ఇంటర్మీడియట్ కళాశాలలు జూన్ 2న ప్రారంభమవుతాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలు తరగతుల ప్రణాళిక, పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయుల డ్యూటీలు తదితర విషయాలను సిద్ధం చేస్తాయని తెలుస్తోంది.

Also Read :  Saudi Arabia: వెంటనే ఆపేయండి.. ఇజ్రాయెల్‌కు వార్నింగ్‌ ఇచ్చిన సౌదీ

summer-holidays | summer-vacations | school-holiday | summer vacation ideas

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు