/rtv/media/media_files/2026/02/19/bio-asia-summit-2026-02-19-19-15-26.jpg)
Bio Asia summit
హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఆసియా సదస్సు బుధవారం ముగిసింది. ఫిబ్రవరి 17,18న రెండ్రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో లైఫ్ సైన్సెన్, ఫార్మా, బయో సాంకేతికతలో వస్తున్న మార్పులు చర్చలు జరిగాయి. ఏఐని మరింత వినియోగించి ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా పరిశోధనలు చేయాలని ఈ సమ్మిట్‌లో నిర్ణయించారు. పలు కంపెనీలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దాదాపు రూ.1700 కోట్లు పెట్టుబడులుగా పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి.
Also Read: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం
హైదరాబాద్ నగరాన్ని "ల్యాబోరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్‌గా" తీర్చిదిద్దాని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుంది. అలాగే 5 లక్షల మందికి ఇందులో ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్లాన్లను రెడీ చేసింది. ఈ సదస్సులో ఏఐని వాడి ఔషధాలు కనిపెట్టడం, బయోలాజిక్స్ మాన్యుఫాక్చరింగ్ లో ఆటోమేషన్ వినియోగించడం, రోగి జీన్స్, జీవనశైలి ఆధారంగా చికిత్స అందించడం లాంటి విషయాల గురించి సదస్సులో చర్చించారు. క్యాన్సర్ చికిత్సకు వస్తున్న అడ్వాన్స్డ్ వైద్యంపై కూడా నిపుణులు మాట్లాడారు.
Also Read: ఎఫ్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం.. బ్రిటన్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్టు..
ఈ సదస్సులో బయోమెక్సియా హెల్త్‌కేర్ లాంటి అంకుర సంస్థలు, మరికొన్ని ఏఐ ఆధారిత మెడ్‌టెక్ సంస్థలు స్మార్ట్ సెన్సార్ పరికరాలను ప్రదర్శించాయి. మీ చూపుడు వేలును ఈ చిన్న పరికంపై ఉంచితే ఏఐ సాయంతో మీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, హిమోగ్లోబిన్, గుండె పనితీరును కొన్ని సెకన్లలోనే స్కాన్ చేసేస్తుంది. ఇకపై సూదితో గుచ్చాల్సిన అవసరం ఉండదు. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు, ఇంట్లోనే షుగర్ లెవల్స్ చెక్ చేసుకునే వారికి ఎంతగానో ఉపయోగపడనుంది. పెద్ద పెద్ద ల్యాబ్‌లకు వెళ్లకుండా.. ఈ చిన్న డివైజ్‌తో ప్రాథమిక పరీక్షలు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
Follow Us