/rtv/media/media_files/2026/02/19/andrew-2026-02-19-16-32-15.jpg)
Ex-Prince Andrew arrested over ‘misconduct’ amid Epstein files row
ఎఫ్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రపంచ దేశాలను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రోజురోజుకు బయటకు వస్తున్న కీలక విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిటన్ మాజీ యువరాజు, కింగ్ ఛార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటెన్ విండ్సర్‌ను యూకే పోలీసులు అరెస్టు చేశారు. పబ్లిక్ ఆఫీస్‌లో ఆయన దుష్ర్పవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆండ్రూ ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి రహస్య పత్రాలను లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎఫ్‌స్టీన్‌కు పంపిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఈస్టర్న్ ఇంగ్లాండ్‌లోని ఆండ్రూ ఇంటికి చేరుకున్న బ్రిటన్ పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ఆండ్రూ బ్రిటన్ రాయల్ కుటుంబంలో ఒకరు. దివంగత యువరాణి ఎలిజిబెత్ రెండో కుమారుడు. అయితే ఎఫ్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి తాను ఏ తప్పు చేయలేదని ఆండ్రూ పదే పదే చెబుతూ వస్తున్నారు. అంతేకాదు ఎఫ్‌స్టీన్‌తో స్నేహం చేసినందుకు కూడా తాను చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.
Follow Us