MMTS Train Incident: MMTS రేప్ కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన ఎస్పీ!

మేడ్చల్ MMTS ఘటనలో ఎస్పీ చందనాదీప్తి కీలక విషయాలు బయటపెట్టారు. ‘బాధితురాలు లేడిస్ కంపార్ట్ మెంట్‌లోనే ఎక్కింది. ఆ తర్వాత మరో ఇద్దరు ఎక్కి దిగిపోయారు. అప్పుడే ఓ వ్యక్తి ఆమెపై చేయివేశాడు. దీంతో ఆమె భయంతో కిందికి దూకేసింది. అతడిపై కేసు నమోదు చేశాం’ అన్నారు.

New Update
Attempted rape

MMTS rape case

హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై ఓ దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా బాధితురాలిని ఎస్పీ చందనా దీప్తి పరామర్శించారు. ఈ మేరకు ఈ సంఘటన గురించి చందనా దీప్తి కీలక విషయాలు తెలిపారు. బాధితురాలు లేడిస్ కంపార్ట్ మెంట్‌లోనే ఎక్కింది అని అన్నారు. ఆమె రైలు ఎక్కిన సమయంలో మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని తెలిపారు.

ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

అయితే అల్వాల్‌ స్టేషన్‌ రాగానే ఇద్దరు మహిళలు దిగిపోయారని.. దీంతో అదే కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ వ్యక్తి.. బాధిత యువతి వద్దకు వచ్చి ఆమెపై చేయి వేశాడని తెలిపారు. వెంటనే భయంతో ఆ బాధిత యువతి రైలు నుంచి దూకేసిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని ఎస్పీ దీప్తి అన్నారు. ఇందులో భాగంగానే నిందితుడు ట్రైన్ ఎక్కిన ప్రాంతం చెక్ చేస్తున్నామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

ఏం జరిగింది?

హైదరాబాద్ కొంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. రన్నింగ్‌ ట్రైన్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకోడానికి యువతి ట్రైన్ బోగీ నుంచి కిందికి దూకింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. ఎంఎంటీఎస్‌ రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ దుండగుడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకగా తీవ్ర గాయాల పాలైంది.

ఇది కూడా చదవండి: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఘటన ఆదివారం రాత్ర సమయంలో జరిగింది. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్‌ఫోన్‌ మరమ్మతు కోసం ఆదివారం సికింద్రాబాద్‌కు వెళ్లి తిగిరి ఎంఎంటీఎస్‌లో మేడ్చల్‌కు బయలుదేరింది. మహిళల కోచ్‌లో ఆమె ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్‌ స్టేషన్‌లో దిగిపోయారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!

బోగీలో యువతి ఒక్కతే ఉండగా ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీపుటేజ్ ఆదారంగా నిందితుడిని కోసం గాలిస్తున్నారు. 

(MMTS Train Incident | Hyderabad MMTS train | attempted-rape | hydra kompally issue | latest-telugu-news)
Advertisment
Advertisment
తాజా కథనాలు