తెలంగాణ ఐఏఎస్ స్మితా సబర్వాల్ మీద ఓ అవినీతి ఆరోపణ వినిపిస్తోంది. తర్వలో ఆమెకు ఓ యూనివర్సిటీ అధికారులు నోటీసులు పంపే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ కు నోటీసులు జారీ చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రంగం సిద్ధం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఓగా పని చేసినప్పుడు ఆమె ఇన్నోవా కారును అద్దెకు తీసుకున్నారు. 2016 నుంచి 2024 మధ్య 90నెలల పాటు ఆ కారుకు ప్రభుత్వం నుంచి అద్దె చెల్లించారు. ఆ కారు నెలకు రెంట్ రూ.63 వేల రూపాయలు తీసుకున్నారు. ఇటీవల జయశంకర్ యూనివర్సిటీ అడిట్ విభాగంలో లెక్కలు చూడగా.. కారు అద్దెకు తీసుకోవడం వర్సిటీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాహనం అద్దె కింద తీసుకున్న డబ్బులు చెల్లించాలంటూ వర్సిటీ అధికారులు అంటున్నారు.
Also Read: Sub Inspector: లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది
స్మితా సభర్వాల్ అద్దెకు తీసుకున్న టీఎస్ 08 ఈసీ 6345 వాహనం నాన్ టాక్స్ కాదు, ఎల్లో ప్లేట్ వాహనం కాదు. ప్రైవేటు వ్యక్తిగత వాహనం పవన్‌కుమార్ పేరిట ఉన్నట్లు ఆడిట్ విచారణలో వెల్లడైంది. సీఎంవో స్మితా సభర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెలా వాహనం అద్దె రశీదులు రావడంతో యూనివర్సిటీ యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు తేల్చింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పనితీరుపై ఇటీవల ఏజీ జరిపిన విచారణలో కొన్ని తీవ్రమైన అవకతవకలు ఉన్నట్లు వెల్లడయ్యాయి. ఈ విషయం నిజమేనని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్దాస్ జానయ్య అన్నారు. ఈ విషయంపై సమగ్ర నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నామని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు, న్యాయనిపుణుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వర్సిటీ వీసీ పేర్కొన్నారు.
Also read: SC classification: తెలంగాణలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి