మాజీ సీఎం కేసీఆర్ మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగుస్తోంది. మేడిగడ్డ కుంగుబాటుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే జోషి, రజత్ కుమార్‌ను విచారించిన ఘోష్ కమిషన్ ఐఏఎస్ స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్‌ను విచారించింది. ఈ క్రమంలో ఆమెను కమిషన్ ప్రశ్నించగా కొన్ని విషయాలు ఆమె తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కేబినెట్, సీఎంవోకి ఏ ఫైల్ కూడా రాలేదని స్మితా సబర్వాల్ వెల్లడించారు. ఇది కూడా చూడండి: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే! తెలియదు, గుర్తులేదని.. కేవలం ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయని, జీవోను కూడా కేబినెట్ ముందు పెట్టలేదన్నారు. అయితే జీవో 776కు ఇరిగేషన్ శాఖ మంత్రి అనుమతి ఇచ్చారని కమిషన్ ప్రశ్నించింది. దీంతో సీఎంవో వరకు అసలు ఆ ఫైల్ రాలేదని తెలిపారు. అయితే కొన్ని ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదని సమాధానమిచ్చారు. కేవలం స్మితా సబర్వాల్ మాత్రమే కాకుండా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఇలానే సమాధానమిచ్చారు. ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పు డీపీఆర్‌తో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి ఆమోదించారు. దీనిపై జీవో40ని కూడా జారీ చేశారు. దీని గురించి కేబినేట్‌లో చర్చించలేదా? అని అడిగారు. దీనికి స్మితా ఎలాంటి ఫైల్ కూడా రాలేదని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు బడ్జెట్ కోసం కేబినేట్‌లో చర్చించకుండా జీవో జారీ చేశారా? అని ప్రశ్నించారు. దీనికి ఆమె.. సీఎం ఆమోదించిన ప్రతీ విషయం కూడా మన దగ్గరకు రావాల్సిన అవసరం లేదని, అప్రూవల్స్ ఇచ్చిన విషయం కూడా తనకి తెలియదన్నారు. ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు సీఎం సెక్రటరీగా మీ పనులేంటని కమిషన్ ప్రశ్నించింది. దీనికి స్మితా జనరల్ కో ఆర్డినేషన్‌కే పరిమితమని తెలిపారు. సీఎస్ దగ్గర నుంచి వచ్చే ఫైళ్లలో ఏవైనా లోపాలు ఉన్నాయా? లేదా? అని చెక్ చేయడం కూడా తన డ్యూటీ అని చెప్పారు. తన దగ్గరకు వచ్చిన ఫైళ్లలో ఎలాంటి లోపాలు లేవని స్మితా తెలిపారు. చాలా ప్రశ్నలకు స్మితా తెలియదనే సమాధానాన్నే విచారణలో ఉపయోగించారు. ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు నాకు ఎలాంటి సంబంధం లేదని.. తనకు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఎలాంటి సంబంధం లేదని మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్ట్ అప్రూవల్స్ సమయంలో అతను సీఎస్ లేదా ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేయలేదని తెలిపారు. ఇరిగేషన్ సెక్రటరీగా కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేశారని, ఆ సమయంలో ప్రాజెక్ట్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని సోమేశ్ కుమార్ అన్నారు.