/rtv/media/media_files/2024/11/22/Vahn6l28ta3lJj2ZOW7C.jpg)
Mahesh Kumar Goud
Mahesh Kumar Goud : నిన్న జరిగిన బీఆర్ఎస్ సభ(BRS Sabha) వేదికపై కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish Rao) ఫోటోలు లేకుండా చేసి వారిని అవమానించారని, దీంతో వారి మనసుకు మరోసారి గాయమైందని టీపీసీసీ(TPCC) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిందని, దేశ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం కేసీఆర్ ది అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలన, 15 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, టైం వేదిక మీరే డిసైడ్ చేయండి చర్చకు ఎక్కడికి రమ్మన వస్తా? ఫాం హౌస్ దాటి వచ్చే దమ్ముందా కేసీఆర్ అంటూ ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాప్ అయిందని, తెలంగాణకు మొదటి చివరి విలన్ కేసీఆర్ అని మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆ సభలో జనాలకంటే ఎక్కువ విస్కీ బాటిల్స్ ఉన్నాయని ఎద్దేవా చేశారు. సభలో మహిళలు కనిపించలేదని అన్నారు.
ఇది కూడా చదవండి: KCR: అధికారం పోగానే నక్సలైట్లు గుర్తుకొచ్చారా.. కేసీఆర్‌పై రఘునందన్ సంచలన కామెంట్స్!
కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదు..
వరంగల్ సభ లో కేసీఆర్ ప్రసంగంలో పసలేదన్న ఆయన కేసీఆర్ శకం ముగిసిందన్నారు. దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని..నకిలీ గాంధీలు అనడం కేసీఆర్ దుస్సాహసానికి పరాకాష్ట అన్నారు. కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనడానికి నిదర్శనం బీజేపీ పై కేసిఆర్ రెండు నిమిషాల ప్రసంగమేనన్నారు. బీసీ కుల గణన ,ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ చట్టంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ బిక్షతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడన్న ఆయన గాంధీ కుటుంబం పెట్టిన రాజకీయ బిక్షతో దొంగ పాస్ పోర్టుల బిజినెస్ చేసుకునే మీ కుటుంబం లక్షల కోట్లకు పడగలెత్తారన్నారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్.. కారణం అదేనా!?
పదేళ్లలో మీరు 60 వేల ఉద్యోగాలు ఇస్తే..మేము ఏడాదిలో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి కేసీఆర్ కి గుండెల్లో గుబులు మొదలైందని మహేశ్ కుమార్ అన్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఆడుతున్న మూడు ముక్క లాటతో కేసీఆర్ కి మతి భ్రమించిందన్నారు.కుటుంబ కొట్లాట వేగలేక రజతోత్సవ సభ పేరిట కేసీఆర్ హంగామా చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల గణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, సన్న బియ్యం పంపిణీనీ అమలు చేస్తున్నామన్నారు. కేసిఆర్ హయంలో తెలంగాణ అన్ని రంగాల్లో విధ్వంసం పాలైందన్నారు. పార్టీ పేరులోంచి తెలంగాణ పదాన్ని తొలగించినప్పుడు కన్నతల్లిని జన్మభూమిని మించిన స్వర్గం లేదనే మాట కేసీఆర్ కి గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సెంటి మెంటు ను వాడుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఉద్యమ జెండాను దింపితే రాళ్లతో కొట్టి చంపండి అన్న కేసీఆర్ కు పదేళ్లలో అమరవీరులు త్యాగం, ఉద్యమకారులు ఎందుకు గుర్తుకు రాలేదన్నారు.అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని దోచుకొని బీజేపీ కి సాగిలపడి రాష్టానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు.
ఇది కూడా చదవండి: రాత్రిపూట కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటుకు సంకేతం
420 వైఫల్యాలు కేసీఆర్‌వి… ఆయన చేసిన మోసాల గురించి సభలో ఎందుకు చెప్పుకోలేదని మహేష్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కనీసం ఆలోచన లేకుండా కేసీఆర్ తన కుటుంబం బాగుకోసం కాళేశ్వరం కట్టారని విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన వారికి ఒక్క పదవి ఇవ్వకపోగా ..తన కుటుంబానికే అన్ని పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు.కేసీఆర్ హయాంలో విద్య, వైద్యం నిర్లక్ష్యం చేయడం వాస్తవం కాదా అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో వడ్ల కుప్పలపై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది మర్చిపోయారా అని ప్రశ్నించారు. జన్వాడ ఫాంహౌస్ ఎవరివి.. వాటికోసం జీవోలు మార్చారని ఆరోపించారు. కేసీఆర్ పర్మినెంట్‌గా ఫాంహౌస్‌కే పరిమితం కావాలని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ప్రజల సొత్తుని అన్నిరంగాల్లో దోచుకున్నారని మహేష్‌కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. లాభాల్లో ఉన్న తెలంగాణని 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ ను ప్రజలు క్షమించరన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య.. లారీతో ఢీ కొట్టి, వేట కొడవళ్లతో నరికి.. !