women's day celebrations : మహిళా జర్నలిస్టులకూ లైంగిక వేధింపులు తప్పటం లేదని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులు, జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క..మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల కష్టాలు తీర్చేందుకు, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా నాడు మహిళా దినోత్సవం ఆవిర్భవించిందన్నారు.
ఇది కూడా చూడండి: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారన్నారు. శ్రామిక మహిళల శ్రమకు తగిన గుర్తింపు నిచ్చే విధంగా మహిళలు ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకున్నారన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ రకరకాల వివక్షతను అన్ని రంగాల్లోనూ మహిళలు ఎదుర్కొంటున్నారన్నారు. వివక్షతను రూపుమాపేందుకు మన ఆలోచించే విధానాల్లో మార్పు రావాలన్నారు. మహిళలకు తగిన గుర్తింపును ఇచ్చే విధంగా సమాజంలోనూ మార్పు రావాలన్నారు. ప్రతి ఇంట్లో ఆడవారి పట్ల గౌరవం ఇచ్చే విధంగా పిల్లలకు నేర్పించాలని సూచించారు.
ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, వైద్యం కోసం కొత్త పాలసీని తీసుకురానున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రితో మాట్లాడుతానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్న సీతక్క జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వ పాటుపడుతుందన్నారు. మహిళా జర్నలిస్టులు యజమానులుగా ఎదగాలని సూచించారు. మహిళా జర్నలిస్టులకు కూడా లైగింక వేధింపులు తప్పడం లేదని మంత్రి సీతక్క వాపోయారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే పద్ధతిని మొదలు పెట్టింది అంజయ్య అని వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా జర్నలిస్టులను మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు.
ఇది కూడా చూడండి: Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
women's day celebrations : మహిళా జర్నలిస్టులకూ లైంగిక వేధింపులు.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
మహిళా జర్నలిస్టులకూ లైంగిక వేధింపులు తప్పటం లేదని మంత్రి సీతక్క వాపోయారు. హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులు, జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
DANASARI ANASUYA SEETHAKKA