TET: టెట్ పరీక్షలో గందరగోళం.. సర్వర్ డౌన్ కావడంతో ఆగిపోయిన పరీక్ష

తెలంగాణలో జరుగుతున్న టెట్‌ పరీక్షలో గందగోళం నెలకొంది. శంషాబాద్‌లోని వర్ధమాన్ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో పరీక్ష రాస్తున్న 150 మంది అభ్యర్థుల సర్వర్ డౌన్‌ కావడంతో టెట్ పరీక్ష నిలిచిపోయింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Online Exam

Online Exam

తెలంగాణలో జరుగుతున్న టెట్‌ పరీక్షలో గందగోళం నెలకొంది. సర్వర్ డౌన్‌ కావడంతో 150 మంది అభ్యర్థులకు టెట్ పరీక్ష నిలిచిపోయింది. దీంతో పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించి ఆ 150 మందికి తిరిగి పరీక్షను కొనసాగించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్‌లోని వర్ధమాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో టెట్‌ పరీక్షను నిర్వహించారు. 

Also Read: విజృంభిస్తున్న క్యాన్సర్ కేసులు.. ఆస్పత్రుల్లో పెరుగుతున్న బాధితులు

రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.00 PM గంటలకు 750 మంది పరీక్ష రాయాల్సి ఉంది. దీనికి 467 మంది హాజరయ్యారు. ఒక్కసారిగా సర్వర్ డౌన్ కావడంతో 150 మంది అభ్యర్థులకు టెట్ పరీక్ష ఆగిపోయింది. దీంతో విషయం తెలుసుకున్న అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అభ్యర్థులకు మద్దతుగా శంషాబాద్‌- షాబాద్ రహదారిపై బైఠాయించారు. తమ వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చివరికీ దీనిపై స్పందించిన అధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించారు. ఆ తర్వాత 150 మంది విద్యార్థులు తిరిగి పరీక్షను రాశారు. 

Also Read: లిక్కర్‌ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి భారీ నష్టం.. కాగ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

Also Read: వారానికి 90 గంటల పని వివాదం.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు