Bigg Boss 9: బిగ్ బాస్ ఎలిమినేషన్ బిగ్ ట్విస్ట్.. దువ్వాడ మాధురి అవుట్! కారణం ఇదేనా?

బిగ్ బాస్ సీజన్ 9 ఈ వారం ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం దివ్వెల మాధురి, తనూజ, సంజన, కళ్యాణ్, రీతూ, రాము రాథోడ్, డెమోన్ పవన్, గౌరవ్ నామినేషన్స్ లో ఉండగా.. ఎవరూ ఊహించని విధంగా దివ్వెల మాధురి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

New Update
Divvela Madhuri

Divvela Madhuri

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 ఈ వారం ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం దివ్వెల మాధురి, తనూజ, సంజన, కళ్యాణ్, రీతూ, రాము రాథోడ్, డెమోన్ పవన్, గౌరవ్ నామినేషన్స్ లో ఉండగా.. ఎవరూ ఊహించని విధంగా దివ్వెల మాధురి ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీగా హౌజ్ లోకి అడుగుపెట్టిన మాధురి.. వచ్చిన మొదటి రోజు నుంచే హౌజ్ ను అల్లాడించింది. గొడవలు, ఆర్గుమెంట్స్ తో బిగ్ బాస్ ఇంటిని ఒక్కసారిగా హీటెక్కించింది. వచ్చిరాగానే శ్రీజ, కళ్యాణ్ తో గొడవేసుకొని ఫుల్ ఫైర్ బ్రాండ్ అనిపించుకుంది. దీంతో మాధురి బిగ్ బాస్ జర్నీ గట్టిగానే ఉండబోతుందని అనుకున్నారు అందరు. కానీ, ఊహించని విధంగా నామినేషన్స్ లోకి వచ్చిన మొదటి సారే ఎలిమినేటై అందరికి షాకిచ్చింది. 

లీస్ట్ ఓటింగ్ 

సోషల్ మీడియా పోల్స్ ప్రకారం.. ఈ వారం అందరి కంటే మాధురికి చాలా తక్కువగా ఓటింగ్ పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ వారం మాధురి ఓటింగ్ భారీగా పడిపోవడానికి ప్రధాన కారణం నామినేషన్స్ లో రీతూతో ఆమె ప్రవర్తించిన తీరు! నామినేషన్స్ లో మాధురి రీతూని పై రెచ్చిపోయింది. నువ్వు గేమ్ కోసం పవన్ ని వాడుకుంటున్నావు.. నీది ప్యూర్ రిలేషన్ షిప్ కాదు, నీకు అతడితో ఉన్నది ఇంప్యూర్ బాండ్ అంటూ ఇష్టానుసారంగా మాటలు వదిలేయడం ప్రేక్షకుల్లో ఆమెకు నెగిటివిటీని తీసుకొచ్చింది. 

Also Read: Dadasaheb Phalke Awards 2025: ప్రభాస్ 'కల్కి' చిత్రానికి మరో అరుదైన గౌరవం! అవార్డుల ఫుల్ లిస్ట్ ఇదే

Advertisment
తాజా కథనాలు