/rtv/media/media_files/2025/02/17/1HOxlTqD55BkT8RKWJAs.jpg)
madhu yaski Photograph: (madhu yaski)
ప్రస్తుతం తెలంగాణలో సీఎం సీటు ఖాళీగా లేదని టీపీసిసి ప్రచార కమిటి చైర్మన్ మధు యాష్కి గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పని చేస్తున్నారని ఆయన ఆదివారం చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బీసీ నాయకుల అవసరం ఉందని చెప్పారు. బీసీలకు మేలు జరుగలంటే ప్రకటనలు కాదు.. పక్క ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీసీ సామాజిక వర్గానికి చెందని వారు ముఖ్యమంత్రులు అవుతుంటే.. తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ఎందుకు సిఎంలు కావడం లేదో ఆలోచించాలన్నారు మధు యాష్కి గౌడ్. బండి సంజయ్ ఒక గాడి తప్పిన బండి లాంటి వాడని, అందుకే బండి సంజయ్ మాటల తీరు గాడి తప్పిన్నట్లున్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ కులంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
Also Read: ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..?
రాహుల్ గాంధీ తనది ఏ కులామో, మతామో జైపూర్ పార్టీ ప్లినరీ మీటింగ్‌లోనే చెప్పారని మధు యాష్కి గౌడ్ అన్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో విభజించి పాలించే ది బీజేపీ పార్టీయే అని విమర్శించారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న బండి సంజయ్ ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేంద్ర మంత్రియే రాహుల్ గాంధీని ఏ కులమాని అడగడమేంటని ఆయన బండి సంజయ్‌ను నిలదీశారు. అలాంటి వారికి మంత్రి వర్గంలో ఉండే అర్హత కూడా లేదని మండి పడ్డారు మధు యాష్కి గౌడ్. మన్మోహన్ సింగ్, సోనియా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా గుడి, చర్చి, మస్జీద్ లు తిరిగి రాజకీయాలు చేయలేదని వివరించారు. మేదావులు, బీసీ సంఘాల నేతలు గులాబీ నేతకు, గులాబీ పువ్వు ఇచ్చి కులగణన సర్వే లో పాల్గొన్నామని చెప్పాలని ఆయన కౌంటర్ వేశారు.
Also Read: రైల్వే స్టేషన్‌తో తొక్కిసలాట.. బిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేసిన మహిళా కానిస్టేబుల్