Vande Bharat :విశాఖ వందే భారత్ ట్రైన్ కోచ్‌లు పెంపు

సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వందే భారత్‌కు బాగా డిమాండ్ ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీని కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈ నెల 13 నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఇక మీదట 16 కోచ్‌లు ఉండనున్నాయి. 

New Update
vande bharat

Vande Bharath express

తెలుగు రాష్ట్రాల్లో పండగ సందడి నడుస్తోంది. హైదరాబాద్ నుంచి జనాలు ఆంధ్రాకు పండగ కోసం తరలి వెళుతున్నారు. రైళ్ళు కిక్కిరిసిపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వందే భారత్ ట్రైన్ కోచ్‌లను పెంచుతున్నామని దక్షిణ భారత రైల్వేశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఎనిమిది ఉన్న కోచ్‌లను 16కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1,128కి పెరగనుందని ప్రకటించింది. ఈ నెల 13 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. 

Also Read: హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ –సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం

వందేభారత్‌(20707/20708) ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను 2024 మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో ఎగ్జిక్యూటివ్ కోచ్ 1, ఛైర్ కార్ కోచ్‌లు 7 ఉన్నాయి. ఇప్పుడు తాజా నిర్ణయంతో 2 ఎగ్జిక్యూటికోచ్‌లు, 14 ఛైర్‌‌ కార్‌‌ కోచ్‌లకి పెరుగుతాయి.

Also Read: USA: మిలియన్ డాలర్ల లగ్జరీ బిల్డింగ్..బుగ్గిపాలు

Advertisment
తాజా కథనాలు