USA: మిలియన్ డాలర్ల లగ్జరీ బిల్డింగ్..బుగ్గిపాలు

అమెరికాలోని లాస్ ఏంజెలెస్ తగలబడిపోయింది. అక్కడి విలాసవంతుల ప్రదేశాలు అన్నీ కాలి బుగ్గయ్యాయి. పసిఫిక్ పాలిసేడ్స్ లో రగిలిన మంటల్లో అత్యంత ఖరీదైన భవనం శిథిలంగా మారింది. దీని విలువ రూ.1,077 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. 

New Update
USA Building

Before, After

లాస్ ఏంజెలెస్‌లో ఎక్కడ చూసినా కాలిపోయిన ఇళ్ళే కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు ఎంతో వైభవంతో తూలతూగిన హాలీవుడ్ ప్రస్తుతం మరుభూమిలా మారింది. రగులుతున్న కార్చిచ్చు, బూడిద అయిన ఇళ్ళు, భవనాలు దర్శనమిస్తున్నాయి.

1, 077 కోట్లు అగ్నికి ఆహుతి..

లాస్‌ఏంజెలెస్‌లో అత్యంత విలాస వంతమైన భవనాల్లో ఒకటైన లుమినార్ టెక్నాలీజీస్ సీఈఓ ఆస్టిన్ రస్సెల్ భవనం కూడా తగులబడిపోయింది. 18 గదులతో 125 మిలియన్ల డాలర్ల విలువ చేసే ఈ బంగ్లా అగ్నికి ఆహుతి అయిపోయింది. దీనిని యన అద్దెకు ఇచ్చేవారు. 3కోట్లకు పగా అద్దె వచ్చేది అని చెబుతున్నారు. సక్సెష్ అనే టీవీ షోలో ఈ భవనం కనిపిస్తుంది. ఇందులో ఉండే ఖరీదైన ఫర్నిచర్, అందమైన గార్డెన్స్ అన్నీ మొత్తం కాలి మసైపోయాయి. 

మరోవైపు అక్కడి అమెరికా బీమా రంగం కుదేలయింది. జేపీ మోర్గాన్, మార్నింగ్‌ స్టార్‌ అంచనాల ప్రకారం 20 బిలియన్‌ డాలర్ల వరకు బీమా సంస్థలకు నష్టం రావచ్చని అంచనా వేస్తోంది. చాలా మంది ఇళ్ళకు తాము బీమా ఇవ్వలేమని కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. ఇక కాలిఫోర్నియాలోని అతిపెద్ద బీమా సంస్థ స్టేట్‌ ఫామ్‌ అయితే కొన్ని నెలల కిందటే పాలిసాడ్స్‌లోని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు కార్చిచ్చు ముప్పు ఉందని గ్రహించి పాలసీలు ఇవ్వడం మానేసింది. మరోవైపు ప్రపంచంలోనే అతి పెద్దది అయిన బన్నీ మ్యూజియం పూర్తిగా కాలిపోయింది.  ఇక్కడ దాదాపు 46,000 కుందేళ్ల రూపంలో ఉన్న వస్తువులు మంటల్లో కాలిపోయాయి.  

Also Read: హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ –సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు