/rtv/media/media_files/2025/11/10/rotten-eggs-in-lunch-17-students-on-the-spot-2025-11-10-19-38-09.jpg)
Rotten eggs in lunch.. 17 students on the spot..
Karimnagar: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది. అయితే ఆయా హాస్టల్స్, పాఠశాలల్లో సిబ్బంది నిర్లక్ష్యం, వంట చేసేవారి అలసత్వం మూలంగా పలుసార్లు భోజనం వికటిస్తోంది. దీంతో పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురవ్వడం, ఆసుపత్రుల పాలవ్వడం సర్వసాధాణమైంది. అయితే తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలోనూ అపశృతి చోటు చేసుకుంది. ఇక్కడి స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.. అప్రమత్తమైన ఉపాధ్యాయులు చికిత్స కోసం వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
విద్యార్థులె భోజనం చేసిన తర్వాత వాంతులు చేసుకుంటూ, కడుపు నొప్పితో విద్యార్ధులు విలవిల్లాడారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు చికిత్స కోసం వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ రోజు మధ్యాహ్న భోజనంలో విద్యార్ధులకు ఇచ్చిన గుడ్లు వాసన వచ్చినట్లు విద్యార్ధులు తెలిపారు. ఇక అన్నంలో పురుగులు కూడా వచ్చాయని పలువురు విద్యార్థులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాగా రాష్ట్రంలో గత కొంతకాలంగా మధ్యాహ్న భోజనం పథకంపై పలు విమర్శులు వస్తు్న్నాయి. నాణ్యతలేని, శుభ్రతలేని భోజనం పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. వంటవండేవారు, కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఇచ్చే సరుకులను ఇండ్లకు తరలిస్తు్న్నారనే ఆరోపణలున్నాయి.
నాణ్యత లేని భోజనం విద్యార్ధులకు వడ్డించడం వల్ల వారు తరచూ అనారోగ్యం భారీన పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఇలాంటి నిర్లక్ష్య ఘటనలతో ప్రభుత్వానికి చెడుపేరు వస్తోంది.
Follow Us