ఆ పార్టీకి గతమే.. ఇక భవిష్యత్ లేదు : సీఎం రేవంత్ రెడ్డి

BRS పార్టీ పదేళ్లపాటు నిరుద్యోగులను అనాథలుగా తిప్పిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హత BRSకు లేదన్నారు. నిజామాబాద్ ‌కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

New Update
revanth reddy

revanth reddy Photograph: (revanth reddy )

బీఆర్ఎస్ పార్టీ పదేళ్లపాటు నిరుద్యోగులను అనాథలుగా తిప్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హాయంలో కోచింగ్ సెంటర్లు చుట్టూ తిరుగుతూ.. ఉద్యోగాల భర్తీకోసం పట్టభద్రులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశరని అన్నారు. ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని ఆయన చెప్పారు. నిజామాబాద్ ‌కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హత బీఆర్ఎస్ లేదని ముఖ్యమంత్రి ఆరోపించారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఓటు వేయాలో బీఆర్ఎస్‌ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు గతమే తప్పా.. భవిష్యత్ లేదని ఎద్దేవా చేశారు. 

Also Read: US JOBS-Trump: 2 వేల మంది యూఎస్ ఎయిడ్‌ ఉద్యోగులను పీకి పారేసిన ట్రంప్‌!

ఈ సందర్భంగా ఈ కార్ రేసింగ్‌లో కేటీఆర్‌ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ముఖ్యమంత్రి కేంద్ర హో సహాయ శాఖమంత్రి బండి సంజయ్‌ను అడిగారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నింధితులను విదేశాలను నుంచి తీసుకొచ్చే పని కూడా కేంద్రం చేతిలోనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎన్నికల ఆమామాషీ కాదని అన్నారు. గ్రాడ్యుయేట్లు అందరూ ఆలోచించి ఓటు వేశాయని కోరారు.

Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్‌... 140 సోషల్‌ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!

తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టబభద్రులే కీలకమని ఆయన అన్నారు. నిరుద్యోగులను పదేళ్లపాటు బీఆర్ఎస్ అనాథలుగా తిప్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగేనే నియామకాలు చేపట్టిందని  చెప్పుకొచ్చారు. 55వేల 160 ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బలహీన పరచాలని కుట్రలు జరుగుతున్నాయన ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు