BREAKING: తెలంగాణ‌లో 24గంటలపాటు రెడ్ అల‌ర్ట్

వాయువ్య మ‌ధ్య బంగాళాఖాతం స‌మీపంలో వాయుగుండం ఏర్ప‌డింది. దీని ప్రభావం కారణంగా రానున్న 24 గంటలు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్నీ జిల్లాలకు వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది.

New Update
V BREAKING

వాయువ్య మ‌ధ్య బంగాళాఖాతం స‌మీపంలో వాయుగుండం ఏర్ప‌డింది. దీని ప్రభావం కారణంగా రానున్న 24 గంటలు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ప్ర‌భావంతో తెలంగాణ వ్యాప్తంగా అన్నీ జిల్లాలకు వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. 24 గంట‌ల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా 21 సెం.మీ.కు పైగా వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది. ఇక ఉత్త‌ర కోస్తా, ద‌క్షిణ కోస్తాతో పాటు అన్ని జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. దాదాపు 12 నుంచి 20 సెం.మీ. వ‌ర్షపాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది.

పూరీ తీరానికి దక్షిణ ఆగ్నేయంగా 60 కిలోమీట‌ర్ల దూరంలో, గోపాల్‌పూర్‌కు తూర్పు దిశ‌గా వాయుగుండం కేంద్రీకృత‌మైంది. క్ర‌మంగా వాయువ్య దిశ‌గా వాయుగుండం వస్తోంది. పూరీ, క‌ళింగ‌ప‌ట్నం స‌మీపంలో వాయుగుండం తీరం దాట‌నుంది. మ‌హారాష్ట్ర నుంచి తెలంగాణ‌, క‌ర్ణాట‌క మీదుగా ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. స‌ముద్ర మ‌ట్టానికి 3.1 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డింది.

Advertisment
తాజా కథనాలు