శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు ట్రావన్‌కోర్ దేవస్థానం తెలిపింది. మరణించిన వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది. By Kusuma 03 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి శబరిమల భక్తులకు ట్రావన్‌కోర్ దేవస్థానం శుభవార్త తెలిపింది. అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు తెలిపింది. శబరిమల యాత్ర సాఫీగా సాగడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపారు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన వారు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారిని స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు కూడా టీడీబీ చేస్తుందని తెలిపారు. ఇది కూడా చూడండి: కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే.. క్యాబిన్ బ్యాగేజీలో తీసుకెళ్లవచ్చు.. ఇదిలా ఉంటే ఇటీవల కేంద్రప్రభుత్వం కూడా శబరిమల భక్తుల విషయంలో కొన్ని కండీషన్లను తొలగించింది. ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు విమానాల్లో క్యాబిన్ బ్యాగేజీలో తీసుకెళ్లవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రతీ ఏడాది లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్తుంటారు. ఇది కూడా చూడండి: Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్ ఈ అవకాశం 2025 జనవరి 20వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. శబరిమల యాత్ర నవంబర్ నెల మధ్యలో పారంభమై.. జనవరి 20తో ముగుస్తుంది. జనవరి నెలలో మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు ఇరుముడులతో భారీ సంఖ్యతో వెళ్తుంటారు. ఇది కూడా చూడండి: Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య శబరిమలలో అయ్యప్ప దర్శన వేళలు కూడా మర్చారు. వేకువ జామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. మళ్లీ తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగిస్తారని కేరళ ప్రభుత్వం తెలిపింది. దర్శన సమయాల్లో మార్పుల వల్ల భక్తులకు రోజుకీ 17 గంటల సమయం కేటాయించినట్లు అవుతుంది. ఇది కూడా చూడండి: Train Accident: రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి! #sabarimala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి