ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి! ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద బుక్ చేసుకోవాలంటే రేషన్, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి. ఇంట్లో ఎవరి పేరు మీద కనెక్షన్ ఉందో వారి పేరు తప్పకుండా రేషన్ కార్డులో ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది. By Kusuma 03 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఏపీలో ఉచిత సిలిండర్ పథకం కింద 31వ తేదీ నుంచి సిలిండర్లు అందిస్తున్నారు. అయితే కొందరు ఈ పథకానికి అర్హులు కాదమోనని సందేహంగా ఉంటున్నారు. ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకోవాలంటే తప్పకుండా ఆధార్, రేషన్ కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. ఇది కూడా చూడండి: కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే.. కేవలం ఒక్క కనెక్షన్‌కి మాత్రమే.. ఒకవేళ భార్య పేరుతో రేషన్ కార్డు ఉండి, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్న కూడా ఈ ఉచిత సిలిండర్ పథకానికి అర్హులు. అయితే రేషన్ కార్డులో సభ్యుల పేర్లతో రెండు కంటే ఎక్కువ కనెక్షన్లు ఉన్నా కూడా రాయితీ కేవలం ఒక్క కనెక్షన్‌కి మాత్రమే వర్తిస్తుంది. గ్యాస్ రాయితీ డబ్బులు తిరిగి అకౌంట్లోకి పడాలంటే కేవైసీ తప్పకుండా పూర్తి చేసి ఉండాలి. ఇది కూడా చూడండి: Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్ సిలిండర్ వచ్చిన 48 గంటల్లోనే రాయితీ డబ్బులు ఖాతాదారుని అకౌంట్లలోకి జమ అవుతాయి. ఈ పథకం విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. సందేహాలు ఉంటే డైరెక్ట్‌గా గ్రామ/వార్డు సచివాలయం లేదా తహసీల్దారు కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. ఇది కూడా చూడండి: Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య రాష్ట్రంలో 1.54 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కేవలం 1.08 కోట్ల కనెక్షన్లు మాత్రమే ఉచిత సిలిండర్ పథకానికి అర్హత పొందాయి. కొందరికి రేషన్ కార్డులు ఉన్నా కూడా గ్యాస్ కనెక్షన్, ఆధార్ ఈ-కేవైసీ లేకపోవడంతో అర్హత సాధించలేకపోయారు. ఇది కూడా చూడండి: Train Accident: రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి! #ap free gas cylinder scheme 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి