TS: తెలంగాణ నెక్స్ట్ సీఎస్ రామకృష్ణారావు!

తెలంగాణకు ప్రస్తుత సీఎస్ గా ఉన్న శాంతి కుమారి పదవీకాలం వచ్చే నెల ఏప్రిల్ తో ముగిస్తోంది ఈ నేపథ్యంలో తర్వాతి సీఎస్ గా కె. రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు.

New Update
ts

K. Rama Krishna Rao

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం శాంతికుమారి ఉన్నారు. ఈమె పదవీ కాలం ఈ ఏప్రిల్ తో ముగియనుంది. దీంతో తదుపరి సీఎస్ ను ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న కె. రామకృష్ణారావును సీఎస్ గా నియమించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. రామకృష్ణారావు పదవీ కాలం ఈ ఆగస్టుతో ముగియనుంది. 

తెలంగాణపై అపార అనుభవం..

 తెలంగాణ ఏర్పడిన దగ్గరి నుంచీ కె.రామకృష్ణారావే బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.  ఈయనకు తెలంగాణ సామాజిక పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఉంది. దాంతో పాటూ సమర్ధవంతమైన అధికారిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో పలు ఉమ్మడి జిల్లాలకు కలెక్టరుగా పని చేసిన అనుభవం కూడా ఉంది. ముఖ్యంగా తెలంగాణ వనరులు, వసతులు, సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. పట్టణ ప్రజల జీవితాలే కాక మూరు మూల ప్రజల స్థితిగతులు కూడా తెలుసు. ఇలాంటి అధికారి సీఎస్ అయితే మరింత ఉపయోగంగా ఉంటుందనే ఆలోచనతో కె. రామకృష్ణారావును సీఎస్ గా నియమించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తోంది.  వాస్తవానికి 2023లోనే ఈయన సీఎస్ అవ్వాల్సి ఉంది. అప్పుడు కూడా రామకృష్ణారావు పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే అనూహ్యంగా శాంతకుమారి సీఎస్ అయ్యారు. ఇప్పుడు రామకృష్ణ పేరును కన్సిడర్ చేయడానికి ఇది కూడా ఒక కారణం అని చెబుతున్నారు.  

Also Read: MH: నాగ్ పూర్ లో ఉద్రిక్తత..ఔరంగజేబు సమాధి కోసం ఘర్షణ

Advertisment
తాజా కథనాలు