Haleem: హలీం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో రెస్టారెంట్లు హలీం ధరలను భారీగా పెంచాయి. గతంలో హలీం ధర రూ.250 ప్లేట్ ఉండగా ప్రస్తుతం రూ.300 నుంచి రూ.340కి విక్రయిస్తున్నాయి. మసాలా, మటన్ ధరలు భారీగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెస్టారెంట్ల యాజమానులు తెలిపారు.

New Update
Haleem Recipe: హలీమ్ చేసుకోవడం ఇంత ఈజీనా.. టేస్ట్ అదిరిపోతుంది..!

Haleem

ముస్లింలే కాకుండా హలీం ప్రియులు కూడా రంజాన్ మాసం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మతంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ కూడా హలీం తినడానికి ఇష్టపడతారు. ఇలాంటి వారికి రెస్టారెంట్లు బిగ్ షాక్ ఇస్తున్నాయి. రంజాన్ వేళ రెస్టారెంట్లు అన్ని హలీం ధరలను భారీగా పెంచాయి. 10 నుంచి 20 శాతం వరకు హలీం ధరలను పెంచినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి:TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త!

మసాలా దినుసులు, మటన్ ధర పెరగడంతో..

గతంలో హలీం ప్లేటు రూ.250 కి లభించేది. కానీ ఇప్పుడు రూ.300 నుంచి రూ.340కి కొన్ని రెస్టారరెంట్లు విక్రయిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం మటన్, మసాలా దినుసుల రేట్లు పెరగడమే కారణమని రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మసాలా దినుసుల ధరలు 25 శాతం వరకు పెరిగాయి.

ఇది కూడా చూడండి: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు

దీంతో హలీం ధరలను కూడా పెంచాల్సి వచ్చిందని యాజమానులు అంటున్నారు. కేవలం రంజాన్ మాసంలోనే కాకుండా మిగతా సీజన్‌లో కూడా హలీం లభ్యమవుతుంది. కానీ రంజాన్ మాసంలో లభించే హలీంకి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు అయినా స్విగ్గీ, జొమాటోలో కూడా హలీం లభిస్తుంది. 

ఇది కూడా చూడండి: హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..! 

ఇది కూడా చూడండి:Kiara Advani : గుడ్‌ న్యూస్‌ చెప్పిన కియారా అద్వానీ .. తల్లి కాబోతున్నట్లు ప్రకటన

Advertisment
తాజా కథనాలు