Telangana: తెలంగాణపై ఫెంగల్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో వానలు! తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలోని ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. By Bhavana 02 Dec 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయని అన్నారు. తుపాను ప్రభావం తమిళనాడుతో పాటుగా.. ఏపీ, తెలంగాణపై ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. Also Read: Ap: ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా..తమ్ముడు అంటూ లోకేష్ ఎమోషనల్ ట్వీట్ Fengal Cyclone నేడు మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లకపోకవటమే ఉత్తమమని చెబుతున్నారు. Also Read: విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా.. సోమవారం ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇక తుపాను ప్రభావంతో హైదరాబాద్ లో వాతారవణం ఒక్కసారిగా మారింది. Also Read: యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా రెండ్రోజుల క్రితం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండగా.. ప్రస్తుతం సాధారణ వాతావరణం నెలకొంది. రెండ్రోజుల ముందు వరకు కూడా సాధారణ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోగా.. ప్రస్తుతం 20 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండ్రోజులు ఇదే తరహా వాతావరణం నెలకొని ఉండే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఫెంగల్ తుపాను కారణంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల జల్లులు కురిశాయి. దిల్‌సుఖ్ నగర్, ఛైతన్యపురి, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్, రామాంతపూర్, తార్నాక, అబ్సిగూడ, సికింద్రాబాద్, అంబర్‌పేట, మలక్‌పేట, ఏరియాల్లో జల్లులు కురిశాయి. Also Read: AP Rains: ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. నేడు స్కూళ్లకు సెలవు సోమవారం ఉదయం కూడా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. కాగా, ఫెంగల్ తుపాను కారణంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి నడవాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. తమిళనాడులోని చెన్నై ఎయిర్‌పోర్టున తాత్కాలికంగా మూసేశారు. #telangana-rains #rain-alert #fengal cyclone మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి