Telsngana: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 21న నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వివరించింది.
ఈదురుగాలులు వీచే...
ఈ నెల 22న నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. 23 న కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, , జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడతాయని వివరించింది.
ఎల్లో హెచ్చరికలు...
ఈ మేరకు మూడురోజులు ఆ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. మొన్నటి వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని భారత వాతావరణశాఖ వివరించింది.
Also Read : ఆందోళన విరమించిన జూడాలు..శనివారం నుంచి విధుల్లోకి