కులగణన సమావేశానికి రాహుల్ గాంధీ వస్తారు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన

అక్టోబర్ ఆరు లేదా ఏడో తేదిన కులగణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ మీటింగ్‌కి రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు. కులగణనకు ఇంఛార్జ్‌లుగా ఎమ్మెల్యేలే వెళ్తారని పేర్కొన్నారు.

New Update
mahi


తెలంగాణలో బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ కార్యాలయంలో అసలు మహేశ్వర్ రెడ్డికి కూర్చీనే లేదని సైటర్లు వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండగా.. మరో ముఖ్యమంత్రి అనే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తోందంటూ ప్రశ్నించారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. '' తెలంగాణ బీజేపీలో కిషిన్ రెడ్డికి, మహేశ్వర్ రెడ్డికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అసలు బీజేపీ ఆఫీసులో మహేశ్వర్ రెడ్డికి కుర్చీనే లేదు. 

Also Read: ఢిల్లీలో తీవ్ర కాలుష్యం.. కలుషిత వాటర్ బాటిల్‌తో ఎంపీ నిరసన

రాష్ట్రంలో ఒక సీఎం ఉండగా.. మళ్లీ కొత్త ముఖ్యమంత్రి అనే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తోంది. మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తాయి ?. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పిన విషయాలను కొందరు వక్రీకరిస్తున్నారు. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాలనకు అనుగుణంగానే మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. అక్టోబర్ ఆరు లేదా ఏడో తేదిన కులగణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ నెల 5వ తేదీన సాయంత్రం 4 గంటలకు బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణనపై మీటింగ్ నిర్వహిస్తాం. 

Also Read: అమెరికాలో ఎన్నికల హాడావుడి..ఇండియన్స్ ఓటు ఎవరికి?

ఈ సమావేశానికి విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరవుతారు. పార్టీ నేతలు, బీసీ నేతలు, వివిధ వర్గాల మేధావులతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఈ కులగణన ప్రక్రియపై రాహుల్ వివరాలు అడిగి తెలుసుకుంటారు. ప్రధాని మోదీ ఎప్పుడూ కూడా సమాజంలో ఉన్న వాస్తవాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపరు. కానీ రాహుల్‌గాంధీ విమర్శలను కూడా పాజిటీవ్‌గా తీసుకుంటారు. కులగణన ప్రక్రియ కోసం కనెక్టింగ్ సెంటర్‌ను కూడా ప్రారంభించాము. ఎమ్మెల్యేలే కులగణనకు ఇంఛార్జ్‌లుగా వెళ్తారు '' అని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.  

Also Read: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు