USA: అమెరికాలో ఎన్నికల హాడావుడి..ఇండియన్స్ ఓటు ఎవరికి? అమెరికాలో ఎన్నికల హాడావుడి మొదలైపోయింది.చాలాస్టేట్స్‌లో ఇప్పటికే ఓటింగ్ ప్రారంభం అయింది.నవంబర్ 5తో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.ప్రస్తుతం అమెరికా ఎన్నికల్లో భారత ఓటర్లు ఎవరి వైపు మొగ్గుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరిన్ని వివరాలు ఇక్కడ చదవండి... By Manogna alamuru 02 Nov 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి USA Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు...ప్రపంచమంతా ఆసక్తిగా చూసే ఎన్నికల్లో ఇవి ఒకటి. ఇక్కడ కేవలం రెండు పార్టీ మధ్యనే పోటీ ఉంటుంది. ఒకటి రిపబ్లికన్, రెండు డెమోక్రటిక్. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్స్ తరుఫు నుంచి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్స్ తరుఫు నుంచి కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్యా పోటీ ఇప్పుడు ఆసక్తి కరంగా ఉంది. ముఖ్యంగా యూఎస్‌కి కాబోయే అధ్యక్షుడు ఎవరనేది తెలియజేసే స్వింగ్ స్టేట్స్‌లో కూడా ఇద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉంది. ఎన్నికల ప్రచారంలో ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులూ హోరాహోరీగా ప్రచారం చేశారు. సర్వేల్లో ఇద్దరికి వచ్చే ఓట్లలో పెద్దగా తేడా ఉండటం లేదు. దాంతో ఈ అధ్యక్ష ఎన్నిక పీఠంపై కూర్చునేదెవరో అంచనావేయలేని పరిస్థితి కనిపిస్తోంది. అరిజోనా, మిషిగన్, జార్జియాలో కమల హారిస్ ముందంజలో ఉండగా.. నెవెడా, పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యం ప్రదర్శించారు. నార్త్ కరొలైనా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇక స్వింగ్ స్టేట్ విషయానికి వస్తే...అరిజోనా, నెవెడా,విస్కాన్సిన్, మిచిగాన్, జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియాలను స్వింగ్ టేట్స్ అంటారు. ఇక్కడ ఓటర్ల నిర్ణయం బట్టి అధ్యక్షుడు ఎవరన్నది తేలుతుంది. ఈసారి ఎన్నికల్లో పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినాలోని రిపబ్లికన్లకు మద్దతు కొంచెం ఎక్కువగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఈ మూడు రాష్ట్రాల్లో 49 శాతంతో ముందు ఉండగా, కమలా హారిస్ 48 శాతం ఆధిక్యంలో ఉన్నారు. ఇక నెవడాలో మాత్రం హారిస్ గెలిచే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ట్రంప్‌కి 47 శాతం ఉండగా, కమలా హారిస్‌కి 48 శాతం మద్దతు ఉంది. మిచిగాన్, విస్కాన్సిన్ లలో ఇద్దరిక 49 శాతం మద్దతు ఉంది. ఎమర్సన్ కాలేజ్ పోలింగ్ సర్వే ప్రకారం.. హారిస్‌కి ఆసియన్లు, యూత్‌లో ప్రజాదరణ ఉండగా, మిగతా వర్గాలు ట్రంప్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే వాల్ స్ట్రీట్ జర్నల్ పోల్ ప్రకారం.. ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ఆరింటిలో ఇద్దరు రెండు శాతం పాయింట్ల తేడాలో ఉన్నట్లు చెప్పింది. అరిజోనా, జార్జియా, మిచిగాన్ రాష్ట్రాల్లో కమలా హారిస్ ఆధిక్యంలో ఉండగా.. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవెడాలో ట్రంప్ ముందున్నారు. భారతీయ ఓటర్ల మొగ్గు ఎటువైపు.. ఈసారి అమెరికా ఎన్నికల్లో భారత ఓటర్లు కీలకపాత్ర పోషించనున్నారు. అమెరికాలో భారతీయ ఓటర్లు అధికంగానే ఉన్నారు. ఇక్కడకు వచ్చి సెటిల్ అయినవారే కాకుండా.. గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా ఓటు వేసే ఛాన్స్ ఉంది. భారతీయులకు ట్రంప్‌తో ఇంతకు ముందే అనుభవం ఉంది. లాస్ట్ టైమ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారతీయులు నానా కష్టాలు పడ్డారన్న విమర్శలున్నాయి. వీసాల జారీను చాలా కట్టుదిట్టం చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఎన్ని ఉన్నా...ఈసారి మా మద్దుతు మాత్రం మళ్ళీ ట్రంప్‌కే అంటున్నారు. ఆయన అధ్యక్షుడిగా వస్తేనే జాబ్స్ నిలబడతాయని చెబుతున్నారు. అక్రమ వలసలు ఆగిపోతాయని...ఎవరు నిజాయితీగా రావాలో వారే అమెరికాకు వస్తారని చెబుతున్నారు. కమలా హారిస్ వస్తే అక్రమ వలసలు పెరగిపోతాయని భారతీయులు అభిప్రాయపడుతున్నారు. అదీ కాక ప్రస్తుతం డౌన్ ఫాల్‌లో ఉన్న అమెరికా ఆర్ధిక పరిస్ధితి బాగుపడాలంటే ట్రంపే రావాలని ఇండియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు బైడెన్ చేసిన తప్పులనే కమలా హారీస్ వస్తే రిపీట్ చేస్తారని...ఆమె సవంత అభిప్రాయం ఎలా ఉన్నా పార్టీ చెప్పినట్టుగానే నడుచుకోవాలి కాబట్టి పరిస్థితి ఏమీ మారదు అని అంటున్నారు. అందుకే మా ఓటు ట్రంప్‌కే అని అంటున్నారు. Also Read: Canada-India: కెనడా దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి