రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేకి రాష్ట్ర ప్రజలు సహకరించడంలేదని తెలుస్తోంది. ఈ సర్వేలో భాగంగా వారి వివరాలు ఇచ్చేందుకు ప్రజలు వెనక్కి జంకుతున్నట్లు సమాచారం. పేర్లు, కులం, ఆర్థికపర వివరాలు సహా ఇంకేమైనా వివరాలు చెబితే ఏ పథకాలకు కొతపెడతారో.. రేషన్ కార్డు ఏమైనా రద్దు చేస్తారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజల నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు.
Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
19వ కాలమ్ ప్రశ్నలతో ఆందోళన
ముఖ్యంగా సర్వే ప్రశ్నావళిలో 19వ కాలమ్ నుంచి వస్తున్న పలు ప్రశ్నలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యాపారం టర్నోవర్, ఆదాయ పన్ను చెల్లింపులు, వార్షికాదాయం, బ్యాంక్ అకౌంట్ సమాచారం, భూములు, ధరణి పాసు బుక్ వివరాలు, సహా ఇతర వివరాల సమాచారాన్ని వెల్లడించేందుకు చాలా మంది వెనక్కి జంకుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ట్రంప్ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు
ఆర్థిక పరిస్థితుల ప్రశ్నలపై విముఖత
ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వివరాలు, రిజర్వేషన్ ఫలాలు అడిగినపుడు.. ఆ వివరాలతో మీకేం పని అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం. ఇది కాకుండా సర్వే ప్రశ్నావళి పార్ట్ 2లో ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితులపై ప్రశ్నలు అడిగినపుడు కూడా ప్రజలు తీవ్ర విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. పశు సంపద, వాహనాలు, రేషన్ కార్డు, స్థిరాస్తి, ఇంటికి సంబంధించిన వివరాలు, బ్యాంకు రుణాలు, అప్పులు, ఆస్తులకు సంబంధించిన వివరాలు అడిగినపుడు సమాచారం చెప్పడం లేదని తెలుస్తోంది.
Also Read: ట్రంప్ గెలుపు...అమెరికాకు గుడ్ బై చెబుతున్న హాలీవుడ్ హీరోయిన్లు
ఎదురు ప్రశ్నలు
వివరాలు తెలుపగపోగా.. ఎదురుప్రశ్నలు కూడా వేస్తున్నట్లు సమాచారం. రుణాలు తాము చెల్లించకుంటే ప్రభుత్వం చెల్లిస్తుందా?.. ఆస్తుల వివరాలు మీకెందుకు చెప్పాలి? అని ప్రజలు ఎన్యుమరేటర్లను నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది తమ ఆదాయ వివరాలు సరిగ్గా చెప్పలేదు.
Also Read: అయ్యప్ప భక్తులకు అలర్ట్..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ!
ధరణి వివరాలు మీకెందుకు
అలాగే ధరణి వివరాలు అడిగినా మీకెందుకు అనే ఎదురు ప్రశ్నలు ఎన్యుమరేటర్లకు ఎదురయ్యాయి. అలాగూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ఏరియాలో కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే ఆ వివరాలు చెప్పలేదని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆధార్ నెంబర్, బ్యాంక్ పాస్ బుక్ వివరాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజలు కూడా తమ ఆస్తి, భూముల వివరాలు చెప్పడానికి వెనుకంజ వేశారు. ఇక మరికొందరేమో రైతు భరోసా రానప్పుడు భూమి వివరాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.