/rtv/media/media_files/2025/03/09/H9P1To5KT6AzWfE5WCVo.jpg)
SLBC tunnel rescue
Progress in SLBC tunnel rescue : SLBC టన్నెల్ రెస్క్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. టన్నెల్లో టిబిఎం ముందు భాగంలో ఒక డెడ్ బాడీ గుర్తించినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఒక కార్మికుడి చెయ్యి ని గుర్తించినట్లు రెస్క్యూ బృందాలు తెలిపాయి. ఆ మృతదేహాన్ని బయటకు తీసేందుకు తవ్వకాలు కొనసాగిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. 16రోజులుగా జరుగుతున్న టన్నెల్ రెస్క్యూలో ఇది కీలక పరిణామం. జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారా బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు.
Also Read: పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!
ఇదిలా ఉండగా టన్నెల్ రెస్క్యూ పనులను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం... ఐఐటీ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు కేరళ నుంచి క్యాడవర్ స్నిఫర్ డాగ్స్‌ను కూడా తెప్పించింది. మానవ శరీర అవశేషాలు, కుళ్లిపోయిన మృతదేహాలు, 15 అడుగుల కింద బురదలో కూరుకుపోయిన డెడ్‌బాడీలను సైతం గుర్తించడం, గాలిలో, భూమిలోపల వాసనను పసి గట్టగలిగే సామర్థ్యం కలిగి ఉండడం ఈ డాగ్స్ ప్రత్యేకత. ఈ డాగ్స్‌ను ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లలో కేరళ నుంచి దోమలపెంటలోని టన్నెల్ వద్దకు గురువారం తీసుకొచ్చారు. టన్నెల్‌లోని 13.600 కిలోమీటర్ వద్ద, టీబీఎం పరిసరాల్లో మట్టి, బురదలో కూరుకుపోయిన వారిని ఈ డాగ్స్ గుర్తిస్తాయని భావిస్తున్నారు.
Also Read: మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వండి.. రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్‌లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు. కాగా, ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు.
Also Read: CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి...సోమవారంతో ఎమ్మెల్సీ నామినేషన్లకు ముగింపు
కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది.
Also Read: PM MOdi: భారత్ లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం..ప్రధాని మోదీ
Also Read: Trump: ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!