TS Half Day Schools: రాష్ట్రంలో ఈ నెల 6 వ తేదీ నుంచి నిర్వహించనున్న కులగణన సర్వేలో కేవలం ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే సెకండరీ గ్రేడ్ టీచర్లు మాత్రమే పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేసే ఎస్జీటీలకు ఈ సర్వేలో పాల్గొనకుండా మినహాయింపునిచ్చారు.
Also Read: TET అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలపై కీలక అప్డేట్!
సర్వేలో 36,559 మంది ఎస్జీటీలు, 3,414 ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలు, 6,256 మంది మండల రీసోర్స్ సెంటర్స్ సిబ్బంది, మరో 2 వేలు మినిస్టీరియల్ సిబ్బంది..మొత్తం 48,229 మంది పాల్గొననున్నారు. ఈ నెల 6 నుంచి మూడు వారాల పాటు సర్వే జరగనుంది
Also Read: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..!
దీంతో ప్రాథమిక పాఠశాలలు మూడు వారాలపాటు ఒక పూట నడవనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పని చేస్తాయి. అంటే ఆ తర్వాత ఉపాధ్యాయులు సర్వే కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేసే ఎస్జీటీలు , స్కూల్ అసిస్టెంట్లను సర్వే నుంచి మినహాయించారు.
కులగణనను చాలా పకడ్బందీగా ...
రాష్ట్రంలో కులగణనను చాలా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ స్పష్టం చేశారు. ఈ కులగణన సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చినా.. తప్పుడు సమాచారం నమోదు చేసినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారంనిరంజన్ మాట్లాడుతూ.. కులగణన ద్వారా అన్ని కులాల సామాజిక ఆర్థిక పరిస్థితిని తెలుసుకుంటామన్నారు.
Also Read: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య
కులగణన ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ జరిగేది కాదని ఆయన అన్నారు. బీసీ కమిషన్ ముందు స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రజలుకు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సరైన నివేదిక ఇవ్వకపోతే ఆ కులమే తీవ్రంగా నష్ట పోతుందని ఆయన అన్నారు. అలాగే కులగణన నేపథ్యంలో బీసీ కమిషన్‌కు ఆటంకాలు కలిగించ వద్దని ప్రజలను కోరారు.