TS Half Day Schools: తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త! రాష్ట్రంలో ఈ నెల 6 వ తేదీ నుంచి నిర్వహించనున్న కులగణన సర్వేలో కేవలం ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే సెకండరీ గ్రేడ్ టీచర్లు మాత్రమే పాల్గొననున్నారు. దీంతో ప్రాథమిక పాఠశాలలు మూడు వారాలపాటు ఒక పూట నడవనున్నాయి. By Bhavana 02 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి TS Half Day Schools: రాష్ట్రంలో ఈ నెల 6 వ తేదీ నుంచి నిర్వహించనున్న కులగణన సర్వేలో కేవలం ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే సెకండరీ గ్రేడ్ టీచర్లు మాత్రమే పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేసే ఎస్జీటీలకు ఈ సర్వేలో పాల్గొనకుండా మినహాయింపునిచ్చారు. Also Read: TET అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలపై కీలక అప్డేట్! సర్వేలో 36,559 మంది ఎస్జీటీలు, 3,414 ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలు, 6,256 మంది మండల రీసోర్స్ సెంటర్స్ సిబ్బంది, మరో 2 వేలు మినిస్టీరియల్ సిబ్బంది..మొత్తం 48,229 మంది పాల్గొననున్నారు. ఈ నెల 6 నుంచి మూడు వారాల పాటు సర్వే జరగనుంది Also Read: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..! దీంతో ప్రాథమిక పాఠశాలలు మూడు వారాలపాటు ఒక పూట నడవనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పని చేస్తాయి. అంటే ఆ తర్వాత ఉపాధ్యాయులు సర్వే కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేసే ఎస్జీటీలు , స్కూల్ అసిస్టెంట్లను సర్వే నుంచి మినహాయించారు. కులగణనను చాలా పకడ్బందీగా ... రాష్ట్రంలో కులగణనను చాలా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ స్పష్టం చేశారు. ఈ కులగణన సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చినా.. తప్పుడు సమాచారం నమోదు చేసినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారంనిరంజన్ మాట్లాడుతూ.. కులగణన ద్వారా అన్ని కులాల సామాజిక ఆర్థిక పరిస్థితిని తెలుసుకుంటామన్నారు. Also Read: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య కులగణన ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ జరిగేది కాదని ఆయన అన్నారు. బీసీ కమిషన్ ముందు స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రజలుకు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సరైన నివేదిక ఇవ్వకపోతే ఆ కులమే తీవ్రంగా నష్ట పోతుందని ఆయన అన్నారు. అలాగే కులగణన నేపథ్యంలో బీసీ కమిషన్‌కు ఆటంకాలు కలిగించ వద్దని ప్రజలను కోరారు. Also Read: మరో మూడు రోజులు జోరు వానలు..ఐఎండీ వార్నింగ్! #rtv #telangana-schools #half-day-schools #ts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి