HMWSSB: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ఏరియాలకు నీటి సరఫరా బంద్!

హైదరాబాద్‌లో ఫిబ్రవరి 1న వాటర్ సప్లైకు అంతరాయం ఏర్పడనుంది. నాసర్లపల్లి సబ్ స్టేషన్​లోని 132 కేవీ బల్క్‌లోడ్ ఫీడర్ పీటీ రిపేర్లు కారణంగా కృష్ణా ఫేజ్-1,2,3 నుంచి వాటర్ ​సప్లై​ బంద్ కానుంది. ఉదయం 10 గంటల-సాయంత్రం 4 వరకు పలు ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడనుంది.

New Update
Power shutdown to disrupt water supply in Hyderabad on February 1

Power shutdown to disrupt water supply in Hyderabad on February 1

నాసర్లపల్లి సబ్‌స్టేషన్‌లో 132 కెవి బల్క్ లోడ్ మీటరింగ్ పిటి రిపేర్లు కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాటర్ సప్లై ఆగిపోనుంది. ఫిబ్రవరి 1న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని టిజి ట్రాన్స్‌కో ప్రకటించింది. దీని ఫలితంగా నగరంలోని అనేక ప్రాంతాలకు నీటి సరఫరాలో పాక్షిక అంతరాయాలు ఏర్పడనున్నాయి.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి

అందువల్ల నివాసితులు అవసరమైన జాగ్రత్తలు తీసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరి ఏ ఏ ప్రాంతాల్లో వాటర్ సప్లైకు అంతరాయం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫిబ్రవరి 1న కృష్ణ ఫేజ్ 1, 2, 3లోని రిజర్వాయర్ కమాండింగ్ ప్రాంతాలలో వాటర్ సప్లై బంద్ అవుతుందని అధికారులు వెల్లడించారు.

Also Read :  అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్

ఈ ప్రాంతాల్లో వాటర్ బంద్

మొత్తం కృష్ణ ఫేజ్ 1, 2, 3లోని ప్రభావిత ప్రాంతాలైన మీర్ ఆలం, కిషన్‌బాగ్, అల్-జుబైల్ కాలనీ, శాస్త్రిపురం, సంతోష్‌నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, అస్మాంగఢ్, యాకుత్‌పురా, మాదన్నపేట, మహబూబ్ మాన్షన్, భోజగుట్ట మరియు షేక్‌పేట్, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్, అల్లబంద, నారాయణగూడ, అడిక్‌మెట్, శివం, చిల్కలగూడ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్..

Also Read :  నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్‌!

మారేడ్‌పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వే, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్‌నగర్, పాటిగడ్డ, రియాసత్ నగర్, అలియాబాద్, మైసారం, బండ్లగూడ, హస్మత్‌పేట, ఫిరోజ్‌గూడ, గౌతంనగర్, సాహెబ్ నగర్, వైశాలినగర్, అల్కాపురి, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటో నగర్, మహేంద్ర హిల్స్, ఎలుగుట్ట, రామాంతపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, దేవేంద్రనగర్, గచ్చిబౌలి..

Also Read :  తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..

మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, మధుబన్ కాలనీ, దుర్గానగర్, బుద్వేల్, సులేమా నగర్, గోల్డెన్ హైట్స్, హార్డ్‌వేర్ పార్క్, ధర్మసాయి, గంధంగూడ, బోడుప్పల్, మల్లికార్జుననగర్, మాణిక్‌చంద్, చెంగిచెర్ల, భరత్‌నగర్, ఆనంద్ నగర్ ఎక్స్ రోడ్, పీర్జాదిగూడ, మీర్‌పేట్, కూర్మగూడ, లెనిన్ నగర్, బడంగ్‌పేటలో వాటర్ సప్లైకు అంతరాయం ఏర్పడనుంది.

Also Read :  అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు