ప్రియుడితో పెళ్లి.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్, కారణం తెలిస్తే !

ఇద్దరు మైనర్లు అయిన బావ, మరదల్లు ప్రేమించుకున్నారు. శారీరకంగానూ దగ్గరయ్యారు. అమ్మాయి గర్భం దాల్చడంతో పెద్దలు వారిద్దరికీ పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. వివాహం జరిపిస్తుండగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో చోటు చేసుకుంది.

New Update
Police Stop Minor Girl marriage With Minor Boy  in Saidabad, Hyderabad

ఇద్దరు బావ, మరదల్లు ప్రేమించుకున్నారు. అదే సమయంలో శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో ఆ అమ్మాయి 5 నెలల గర్భవతి అయింది. ఈ విషయం తెలియడంతో ఇరుకుటుంబాలు వారిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇక పెళ్లికి అంతా సిద్ధమైన తరుణంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి జరగడానికి వీలు లేదంటూ పోలీసులు ఇరుకుటుంబాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ఒప్పించినా ఒప్పుకోకుండా మొండికేశారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇరుకుటుంబాలు ఓకే అన్నపుడు పోలీసులు ఎందుకు ఒప్పుకోలేదు? కేసు పెట్టేంత తప్పు వారేం చేశారు? అనే విషయానికొస్తే..

Also Read:  హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

సమీప బంధువులు అయిన బాలిక, బాలుడు కుటుంబాలు కాచిగూడ పరిధిలోని ఓ కాలనీలో ఆరు నెలల కిందట నివశించారు. ఇక పక్క పక్క ఇళ్లలోనే ఉండటంతో బాలుడు, బాలిక ప్రేమలో పడ్డారు. అందులోనూ ఇద్దరూ వరుసకు బావ, మరదల్లు అవుతారు. అలా ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అయితే కొన్ని రోజుల నుంచి ఆ బాలిక నీరసంగా ఉండటంతో అనుమానం వచ్చి తల్లి ప్రశ్నించింది. దీంతో ప్రియుడితో శారీరకంగా కలిసినట్లు ఆ బాలిక తెలిపింది. 

Also Read:  ట్రంప్‌ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు

ఆమెనే పెళ్లి చేసుకుంటా

వెంటనే ఆ విషయం తెలియగానే బాలిక తల్లి సైదాబాద్ పరిధిలోని ఐఎస్ సదన్ సమీపంలోని మరో బస్తీకి మకాం మార్చింది. అయితే తన మరదలిని చూసేందుకు బాలిక ప్రియుడు అక్కడకి తరచూ రహస్యంగా వచ్చేవాడు. ఓ రోజు గమనించిన బాలిక తల్లి అతడిని నిలదీయడంతో ఆమంటే తనకు ఇష్టమని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. 

Also Read:  ట్రంప్‌ గెలుపు...అమెరికాకు గుడ్‌ బై చెబుతున్న హాలీవుడ్‌ హీరోయిన్లు

ఇక అప్పటికే ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో చేసేదేమి లేక ఇరుకుటుంబాలు పెళ్లికి అంగీకరించారు. అయితే ఇదే విషయం కొంతమంది సామాజిక కార్యకర్తలకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ పెళ్లిని అడ్డుకున్నారు. దానికీ ఓ బలమైన కారణం ఉంది. ఎందుకంటే వారిద్దరు అప్పటికి మైనర్లు. బాలుడికి 17 ఏళ్లు, బాలికకి 15 ఏళ్లు ఉన్నాయి. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 

Also Read: రేవంత్ సర్కార్ కు షాక్.. కులగణనపై ప్రజల్లో వ్యతిరేకత!

అయితే అప్పటికే తన బిడ్డ 5 నెలల గర్భవతి అని.. ఈ పెళ్లి జరగకపోతే తమ కుటుంబ పరువు పోతుందని పోలీసుల ముందు ఆవేదన చెందింది. దయచేసి పెళ్లిన అడ్డుకోవద్దంటూ మొరపెట్టుకుంది. పోలీసులు మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ వ్యవహారం పై సైదాబాద్ ఎస్సై శివశంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisment
తాజా కథనాలు