Balka Suman: బాల్క సుమన్ అరెస్టు.. క్యాతన్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత

క్యాతన్‌పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులను పోలీసులకు పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు.

New Update
BREAKING

BREAKING

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులను పోలీసులకు పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసి బాల్క సుమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఇక వివరాల్లోకి వెళ్తే మున్సిపల్ ఎన్నికల ఫలితాల(Municipal Election Results 2026) సందర్భంగా మంత్రి వివేక్ కాన్వాయ్‌పై బాల్స సుమాన్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు రాళ్లు దాడులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాల్క సుమాన్‌పై కేసు నమోదైంది.  

Also Read: శ్రీలంకలో ఎంపీల పెన్షన్లు రద్దు.. మరీ భారత్‌లో పరిస్థితి ఏంటి ?

Balka Suman Arrested

ఈ క్రమంలోనే బుధవారం సుమాన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు భారీగా తరివచ్చారు. ఇంట్లో ఉన్న బాల్క సుమాన్‌ను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. పోలీసుల రాకపై అప్పటికే సమాచారం అందుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయన ఇంటికి భారీగా తరలివచ్చారు. బాల్క సుమాన్ ఇంటి గేట్‌ ఓపెన్‌ చేసేందుకు యత్నించిన పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసులు ఆయన ఇంటి గేట్లు బలవంతంగా తెరిచి అరెస్టు చేశారు. 

Also Read: ముస్లింలకు సర్కార్ బిగ్ షాక్.. రంజాన్ ప్రారంభ వేళ 5శాతం రిజర్వేషన్ రద్దు

Advertisment
తాజా కథనాలు