TG News: తెలంగాణలో హై టెన్షన్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్!
హైదరాబాద్లోని ఒరియన్ విల్లాస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకాల నివాసం ఉంటున్న ఓరియన్ విల్లాలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.