/rtv/media/media_files/2025/03/05/Xdu7C3nl9xQk0goDuBXW.jpg)
prabhakar rao, sravan rao Photograph: (prabhakar rao, sravan rao)
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు విదేశాల్లో విషయం తెలిసిందే. దీంతో సీబీఐ వారికి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలని ఇంటర్ పోల్‌కు సిఫారసు చేసింది. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉన్న ఆ ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సంతృప్తి చెందిన సిబిఐ.. ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలని ఇంటర్ పోల్ ను కోరింది. సీబీఐ జారీ చేసిన నోటీసులతో 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనుంది ఇంటర్ పోల్.
Also read : Karimnagar MLC results: కరీంనగర్ గ్రాడ్యుయేట్ MLC ఫలితాల్లో బిగ్ ట్విస్ట్
ఇన్ని రోజులు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ఆ దేశం వదిలి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు తలదాచుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇంటర్‌పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు అన్ని దేశాలకు చేరిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా నిందితులను హైదారాబాద్ తీసుకొచ్చే ఆలోచనలో తెలంగాణ పోలీసులు ఉన్నారు.
Also read: singer kalpana: పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త ప్రసాద్