/rtv/media/media_files/2025/05/19/ZG5IYNxMtzvNxOQaKdHZ.jpg)
HYDRAA jobs
HYDRAA : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న సంచలన నిర్ణయం హైడ్రా ఏర్పాటు. దీనిద్వారా ఆక్రమణల అంతు చూస్తున్నారు. కూల్చివేతలు అనగానే హైడ్రా పేరు గుర్తుకు వచ్చేంత క్రేజ్ తెచ్చుకుంది.ఇక తాజాగా అందులో జాబ్స్ నోటిఫికేషన్ వేశారు. హైడ్రా అనగానే ఉన్న క్రేజ్ తోనో, సరైన జాబ్స్ లేకనో కానీ హైడ్రాలో డ్రైవర్ జాబ్స్ అనగానే వందలాది మంది ఎగబడ్డారు. రాష్ర్ట నలుమూలల నుంచి వచ్చిన నిరుద్యోగులు హైడ్రా పార్కింగ్ ఆఫీసు ముందు బారులు తీరారు.
ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!
Also Read: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!
హైడ్రాలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో 200 డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సోమవారం నుంచి బుధవారం ( మే 19-21 ) వరకు మూడు రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న నిరుద్యోగులు వెంటనే హైడ్రా ఆఫీసుకు పరుగులు తీశారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసి.. స్వల్ప మార్కుల తేడాతో ఉద్యోగం కోల్పొయిన వారికి తొలి ప్రాధాన్యత ఇస్తామని హైడ్రా చెప్పడంతో కానిస్టేబుల్ గా ఎంపిక కానీ వారంత హైడ్రా జాబుల కోసం ఎగబడ్డారు . ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అన్ని జిల్లాల నుంచి భారీగా యువత తరలి వచ్చారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి హైడ్రా ఆఫీసువంత జనం క్యూ లైన్లల్లో నిలబడి హైడ్రా ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసుకున్నారు.
ఇది కూడా చూడండి: Jyothi Malhotra: జ్యోతికి పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు
ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం