/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలోనే పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు. దీంతో జూబ్లీహిల్స్ హెటైన్షన్ నెలకొంది. మొత్తంగా 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. అలాగే GHMC కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసేవరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతటా మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: పెళ్లి కాస్త విషాదం.. రోడ్డు ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి
ఇదిలాఉండగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. 4,01,365 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్టమైన నిఘా పెట్టారు. అంతేకాదు 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు.
Also Read: పెళ్లి కాస్త విషాదం.. రోడ్డు ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి
గత 14 రోజులుగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్, బీఆర్‌ఎస్ తరఫున కేటీఆర్, బీజేపీ తరఫున కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ ఎన్నికలను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్యే గట్టి పోటీ ఉండనుంది.
Follow Us