Viral Video: ప్రపంచంలో అత్యంత వేగంగా వేటాడే అడవి జంతువులుగా సింహాలను పరిగణిస్తారు. అడవిలో వాటి జీవన విధానం ఇతర జంతువుల కంటే భిన్నంగా ఉంటుంది. మందలలో నివసించడం, ఎవరికీ భయపడటం సింహాలకు చేత కాదు. అందుకే సింహాలను అడవి రాజులు అని కూడా పిలుస్తారు. అయితే సింహాలు పిల్లుల్లా మారి ఓ యువతితో ఆడుకోవడం నెట్టింట వైరల్‌గా మారింది.
సింహాన్ని ముద్దు పెట్టుకోవడం..
ఎప్పుడూ క్రూరంగా, దాడి చేసే మూడ్‌లో ఉండే సింహాలు ఇలా ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక మహిళ తన రెండు చేతులతో ఈ పెద్ద జంతువును ప్రేమగా పట్టుకుని లాలించడం వీడియోలో చూడవచ్చు. కొన్నిసార్లు యువతి సింహాన్ని ముద్దు పెట్టుకోవడం, కొన్నిసార్లు దానిని ప్రేమగా లాలించడం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆమె సింహాలను కౌగిలించుకుంది. భయంకరంగా, క్రూరంగా సింహాలు ఆ యువతి ఒడిలో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తాయి. ఇదంతా చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
I am amazed that a Lion can be so affectionate like this. Lucky her. pic.twitter.com/tOKTNS7GKn
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) December 25, 2024
ఈ వీడియో X హ్యాండిల్ @AMAZlNGNATUREలో షేర్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. 1.1 మిలియన్ల వీక్షణలు, వందల కొద్దీ కామెంట్లు వచ్చాయి. సింహం ఇంత ఆప్యాయత చూపగలదని నేను ఆశ్చర్యపోయాను అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. పలువురు ఆందోళన కూడా వ్యక్తం చేశారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: 5 నిమిషాలు గోళ్లు రుద్దడం వల్ల ప్రయోజనాలు