TGSRTCలో పెరుగుతున్న డొక్కు బస్సులు.. టీజీఎస్‌ఆర్టీసీలో డొక్కు బస్సుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత పదేళ్లలో ఏకంగా 6,680 డొక్కు బస్సుల్ని ఆర్టీసీ తుక్కు కింద వేలం వేసి అమ్మేసింది. మరోవైపు బస్సుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. దీంతో ఎలక్ట్రిక్ బస్సుల్ని ఆర్టీసీ భారీ సంఖ్యలో అద్దెకు తీసుకుంటోంది. By B Aravind 05 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి తెలంగాణలోని ఆర్టీసీ సంస్థలో డొక్కు బస్సుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వీటికి మరమ్మతులు చేసి, రంగులు వేసి కొన్నేళ్లుగా నెట్టుకొస్తున్నారు. అయినాకూడా వాటిని తుక్కుకింద అమ్మేయక తప్పడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటినుంచి గత పదేళ్లలో ఏకంగా 6,680 డొక్కు బస్సుల్ని ఆర్టీసీ తుక్కు కింద వేలం వేసి అమ్మేసింది. ఇక వాటిస్థానంలో కొనుగోలు చేసిన బస్సులు మాత్రం కేవలం 4,226 మాత్రమే గమనార్హం. ఓవైపు ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంటే బస్సుల సంఖ్య మాత్రం తగ్గుతోంది. 2014-15లో 10,748 బస్సులు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 9,518 మాత్రమే ఉంది. ప్రయాణికుల సంఖ్య 25 శాతం పెరిగితే.. బస్సుల సంఖ్య మాత్రం దాదాపు 12.5 శాతం తగ్గిపోయింది. Also Read: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలే ..వానలు! ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గడంతో.. వాటిలో అద్దె బస్సుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సుల్ని ఆర్టీసీ భారీ సంఖ్యలో అద్దెకు తీసుకుంటోంది. 2010లో 40 బస్సుల్ని అద్దెకు తీసుకోగా.. 2023లో 1050 బస్సులకు ఒప్పందం చేసుకుంది. ఇక హైదరాబాద్ కోసం రాష్ట్ర సర్కార్ మరో 2,300 ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్టీసీ వెంటనే తుక్కుగా మార్చాల్సిన డొక్కు బస్సుల సంఖ్య 1,213గా ఉంది. వీటి స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి ఇటీవలే రిపోర్టు పంపింది. ప్రతీ ఏడాది ఆర్టీసీ వేలం పద్దతిలో ఈ తుక్కు బస్సులను అమ్మేస్తోంది. 2014 నుంచి 2024 మధ్యకాలంలో 6,680 బస్సుల్ని స్క్రాప్ కింద విక్రయించారు. ఇందుకుగాను రూ.226.76 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతుండటంతో తుక్కుగా మార్చిన డొక్కు బస్సుల స్థానంలో కొత్తవాటిని వెంటనే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. #telangana #hyderabad #tgsrtc #electric-bus మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి