IT:TCS ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఇక 15 ఏళ్ల పాటు నో టెన్షన్!

ఐటీ రంగానికి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టు కనబడుతున్నాయి. కంపెనీలకు వరుసగా ప్రాజెక్టులు వస్తున్నాయి. తాజాగా టీసీఎస్ రెండు పెద్ద ప్రాజెక్టులను సంపాదించుకుంది. దీంతో 15 ఏళ్ళపాటూ రెండు దేశాల్లో ప్రత్యేక సేవలు అందిస్తామని తెలిపింది. 

New Update
Gallup 2024: మా ఉద్యోగంలో చాలా కష్టపడుతున్నాం అంటూనే స్థిరంగా ఉంటున్న భారతీయులు 

TCS Big Projects: 

పండుగ రోజూ టీసీఎస్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం పెద్ద కంపెనీలకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో మళ్ళీ ఐటీ ఉద్యోగులు బిజీగా మారే రోజులు వస్తున్నాయి. తాజాగా టాటా గ్రూప్ ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రెండు పెద్ద ప్రాజెక్టులు దక్కించుకున్నట్లు ప్రకటించింది. ఐర్లాండ్‌కు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ సోషల్ ప్రొటెక్షన్ సహా బ్రెజిల్ నుంచి మరో డీల్ వచ్చినట్లు తెలిపింది. వీటి విలువ 250 మిలియన్ డాలర్లకుపైగా ఉంటుందని తెలిపింది.

ఐర్లాండ్ సామాజిక భద్రతా విభాగం నుంచి ఒక పెద్ద ప్రాజెక్టును అందుకుంది టీసీఎస్. ఇది 15 ఏళ్ళ కాంట్రాక్ట్. మై ఫ్యూచర్ ఫండ్ అనే రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్‌లో కొత్త ఆటో ఎన్‌రోల్మెంట్ విధానాన్ని అమలు చేయడం, నిర్వహించేందుకు ఈ డీల్ లభించినట్లు టీసీఎస్ తెలిపింది. ఐర్లాండ్‌లో మొత్తం 8 లక్షల మంది ఉద్యోగుల పేర్లను ఆటోమెటిక్‌గా రిటర్మెంట్ ఫండ్‌లో నమోదు చేసేందుకు ఎండ్ టూ ఎండ్ డిజిటల్ సొల్యూషన్స్ దీని ద్వారా అందించనున్నారు. ఈ కాంట్రాక్ట్ 15 ఏళ్ల పాటు ఉంటుందని టీసీఎస్ తెలిపింది. సుమారు 245 మిలియన్ డాలర్లు అంటే భారత దేశ కరెన్సీలో రూ.2 వేల కోట్లకుపైగా ఉంటుంది.

మరొక కాంట్రాక్ట్ బ్రెజిల్‌తో చేసుకుంది టీసీఎస్. బ్రెజిల్‌లోని ప్రముఖ ఉన్నత విద్యా, పరిశోధన సంస్థల్లో ఒకటైన ఇన్‌స్పెర్ తో 10 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ఓ ప్రకటన చేసింది. ఇందులో
 8.6 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది. అంటే భారత కరెన్సీలో రూ.72 కోట్లకుపైగా ఉంటుంది. సౌత్ అమెరికా వ్యాప్తంగా సరికొత్త టెక్నాలజీని వేగవంతం చేయడమే ఈ భాగస్వామ్యం లక్ష్యమని తెలిపింది. ఏఐ, జెన్ ఏఐ, ఐఓటీ, స్పాషియల్ కంప్యూటింగ్ వంటి సరికొత్త టెక్నాలజీల ద్వారా దక్షిణ అమెరికాలోని టీసీఎస్ కస్టమర్లకు అధునాతన ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అందించాలనే లక్ష్యంగా ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది.

Also Read: UNO: యుద్ధం చేస్తే శవాలే మిగులుతాయి..ఉత్తర కొరియాకు అమెరికా హెచ్చరిక

Advertisment
Advertisment
తాజా కథనాలు