Telangana : ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం నాటికి ముగిసింది. మే 27న ఈ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 5న కౌంటింగ్ నిర్వహిస్తారు.
ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం నాటికి ముగిసింది. మే 27న ఈ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 5న కౌంటింగ్ నిర్వహిస్తారు.
తెలంగాణలో మరో 48 గంటలపాటు వైన్స్, బార్లు మూతపడనున్నాయి. మే 27న వరంగల్, నల్లగొండ, ఖమ్మంలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. దీంతో మే 25-27 సాయంత్రం 4 వరకూ క్లోజ్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. చౌటుప్పల్ లో నిర్వహిస్తున్న పట్టభద్రుల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతున్నారు. కేటీఆర్ స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి.
తెలంగాణలో ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధానంలో ఇక ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఇక నుంచి భక్తులు దేవస్థాన వెబ్ పోర్టల్ ద్వారా మే 23 నుంచి ఆన్ లైన్ బుకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు.
TG: బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు మంత్రి కోమటిరెడ్డి. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ భూస్థాపితమవుతుందని అన్నారు. రాష్ట్ర సంపదనంతా దోచుకున్నది చాలక కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి వెళ్లిందని చురకలు అంటించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా వరంగల్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులను కోరుతున్నారు. కేటీఆర్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి, కీన్స్ టెక్నాలజీ గుజరాత్ కు వెళ్లిపోయిందన్నారు. వరంగల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
TG: మంత్రి ఉత్తమ్‌పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో కొత్తగా U ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఉత్తమ్ ఢిల్లీకి 100 కోట్లు పంపించారని ఆరోపించారు. ఏలేటి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపాయి.
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఖమ్మంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. వారి స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.