Telangana: సింగపూర్‌లో తెలంగాణ యువకుడు మృతి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు శ్రీనివాసరావు, చంద్రకళ దంపతుల రెండో కుమారుడు పవన్ (28) సింగపూర్ బీచ్‌కు వెళ్లి అలలకు కొట్టుకుపోయి మృతి చెందాడు. గత ఏడాది నుంచి అతను సింగపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు By B Aravind 07 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఓ యువకుడు సింగపూర్ బీచ్‌కు వెళ్లి అలలకు కొట్టుకుపోయి మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కోదాడ పట్టణంలోని ఎర్నేని టవర్‌లో చౌడవరపు శ్రీనివాసరావు, చంద్రకళ దంపతుల రెండో కుమారుడు పవన్ (28) హైదరాబాద్‌లో ఆరేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత గత ఏడాది ఫిబ్రవరి నుంచి సింగపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శుక్రవారం.. పవన్ తన స్నేహితులతో కలిసి సెన్సోటియా బీచ్‌కు వెళ్లాడు. Also read: 6 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి- రేవంత్ రెడ్డి నీటిలో దిగాక పవన్.. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందినట్లు తమకు సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక శ్రీనివాస రావు పట్టణంలో ఓ ఆయిల్ మిల్లును రన్ చేస్తున్నారు. ఆయనకు మగ్గురు కొడుకులు. రెండో కుమారుడు పవన్. పెద్ద కొడుకు లండన్‌లో ఉద్యోగం చేస్తుండగా.. ముడో కొడుకు స్థానికంగా ఉంటూ తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. మరికొన్ని రోజుల్లో పవన్ సింగపూర్ నుంచి అమెరికాకు వెళ్లాల్సి ఉందని అతని బంధువులు చెప్పాడు. కొడుకు మృతితో వాళ్ల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. Also read: తెలంగాణలో రాజకీయ సంక్షోభం.. 38 మంది ఎమ్మెల్సీల పదవులు ఫట్? #death #telugu-news #singapore #suryapet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి