ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ కొండలు, నల్లమల అడవి అందాలు వాటి మధ్యలోంచి పడవలో ప్రయాణం. ఆహా వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది కదూ. అలాంటి ప్రయాణం మీరు కూడా చేయాలనుకుంటున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్. మన తెలంగాణలో అలాంటి అందమైన ప్రదేశం ఇప్పుడు ప్రయాణికులను కనువిందు చేస్తుంది.
Also Read: నవంబర్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!
నదిలో జల విహారం
కృష్ణా నదిలో జల విహారం చేసే సౌకర్యాన్ని తెలంగాణ పర్యాటక శాఖ అందుబాటులోకి తెచ్చింది. కార్తీక మాసం సందర్భంగా సర్‌ప్రైజ్ చేసింది. మొదటి రోజున (నవంబర్ 02న) టూర్ ప్యాకేజీని పర్యాటక శాఖ ప్రారంభించింది. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని సాగించవచ్చు.
కాగా గత ఐదేళ్లుగా ఈ లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఎన్నో కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ముఖ్యంగా నాగార్జున సాగర్‌లో సరైన స్థాయిలో వాటర్ లేకపోవడం, కరోనా మహమ్మారి.. ఇలా తదితర కారణాల వల్ల ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి రాలేదు.
నాగార్జున సాగర్ To శ్రీశైలం
Also Read: కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...30 మంది!
ఇక ఇప్పుడు అంతా సవ్యంగా సమకూరడంతో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే కార్తీక మాసం మొదటి రోజున దీనిని ప్రారంభించింది. తొలిరోజు లాంచీ ప్రయాణానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు.
Also read: లెబనాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్...కూలిన భారీ భవనాలు!
ఇవాళ నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకు తొలి ఏసీ లాంచీ అయింది. సుమారు 100 మంది టూరిస్టులతో తొలి ప్రయాణం మొదలైంది. మళ్లీ రేపు తిరిగి సాగర్‌కు లాంచీ చేరుకోనుంది. ఈ ప్రయాణం దాదాపు 120 కి.మీ దూరం సాగుతుంది. అంత దూరం ప్రయాణానికి దాదాపు 7 గంటల సమయం పడుతుంది.
Also Read: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..!
ఇక ఈ టూర్ ప్యాకేజీ ధర విషయానికొస్తే.. పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1600 టికెట్ ధరను ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ధర కేవలం ఒకసైడుకు మాత్రమే రెండువైపులా అయితే.. పెద్దలకు రూ.3000, పిల్లలకు రూ. 2400గా నిర్ణయించింది. ఈ ప్యాకేజీని వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.