Upasana konidela : ఆయనతో నా ప్రయాణం ముగిసింది.. ఉపాసన భావోద్వేగ పోస్ట్ వైరల్

నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉపాసన ఇటీవల తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని భక్తి, శ్రద్ధలతో పాటించి పూర్తి చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఇన్‌స్టా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్‌ పంచుకున్నారు.

New Update
Ram Charan Upasana

Ram Charan Upasana

Upasana konidela : వరుస విజయాలతో గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన రామ్‌చరణ్‌ భార్య ఉపాసన గురించి చాలామందికి తెలుసు.  కేవలం రామ్‌చరణ్‌ సతీమణిగానే కాకుండా అపోలో ఆసుపత్రుల వైస్‌ ఛైర్‌ పర్సన్‌గా, సామాజిక కార్యక్రమాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉపాసన ఇటీవల తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని భక్తి, శ్రద్ధలతో పాటించి పూర్తి చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఇన్‌స్టా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్‌ పంచుకున్నారు. గురు పూర్ణిమ నాడు ఉపాసన మొదలు పెట్టిన సాయిబాబా వ్రతాన్ని సెప్టెంబరు 4వ తేదీతో ముగించారు. వ్రతం పూర్తయిన సందర్భంగా షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకోనున్నట్లు వెల్లడించారు. క్లింకారా నర్స్ లతా సిస్టర్‌తో కలిసి  ఈ వ్రతాన్ని ప్రారంభించినట్లు అంతకు ముందే వెల్లడించింది. తాజాగా, ఈ వ్రతం పూర్తైనట్లు ఉపాసన తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది.

ఇది కూడా చూడండి:Putin: ఇండియా, చైనా జోలికి వస్తే వదిలి ప్రసక్తే లేదని.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

 ‘‘గురు పౌర్ణమి నాడు నేను ప్రారంభించిన  సాయిబాబా వ్రతం 9 వారాల పాటు కొనసాగింది. శాంతి, స్వస్థత, విశ్వాసంతో నా ప్రయాణం ముగిసింది. నేను ఈ వ్రతాన్ని క్లీంకారా నర్సు లతా సిస్టర్‌తో కలిసి ప్రారంభించాను. నా సోదరితో కలిసి మొదలు పెట్టిన ఈ వ్రతంతో నేను అభిలషించిన దాని కన్నా ఎక్కువగా బాబా ఆశీస్సులు లభించాయి.  నన్ను సదా రక్షిస్తున్న ఆ సాయిబాబాకు ధన్యవాదాలు. నా జీవిత కాలంలో వీలైనంత ఎక్కువమందికి సేవ చేస్తానని బాబాను ప్రార్థించాను. అలాగే నిత్యం మాకు రక్షణగా ఉన్నందుకు సాయిబాబాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అత్తమ్మాస్ కిచెన్ తరపున ఈ రోజు భోజనం వడ్డిస్తున్నాము.. జై సాయిరామ్’’ అనే క్యాప్షన్ జత చేసింది. 

Also Read: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!

 కాగా తనకు చిన్నప్పటి నుంచే తనకు దైవం మీద ఎంతో భక్తి అని గతంలో ఉపాసన చెప్పారు. సాయిబాబా వ్రతం చేయడం మొదలు పెట్టగానే సానుకూల ఆలోచనలు, పరిస్థితులు అలవడ్డాయని చెప్పారు. అత్యంత భక్తితో, నిష్టతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే  ఫలితం దక్కుతుందని ఉపాసన సహా సాయి భక్తుల విశ్వాసం. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, విజయం లభిస్తాయని, ఐశ్వర్యం, కుటుంబ శాంతి, విద్య, ఉద్యోగం, వివాహం ఇలా సకల మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. కాగా చాలా బిజీగా ఉంటూ కూడా ఉపాసన సాయిబాబా వ్రతాన్ని పూర్తి చేయడం పట్ల రామ్‌చరణ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు.

ఇది కూడా చూడండి: Putin Modi Meeting: మోదీతో కారులో మాట్లాడి.. సీక్రెట్ లీక్ చేసిన పుతిన్

#saibaba aarti #saibaba #global star ram charan #upasana-konidela #klinkara-konidela
Advertisment
తాజా కథనాలు