/rtv/media/media_files/2025/09/08/musi-revitalization-work-begins-today-2025-09-08-07-51-13.jpg)
Musi revitalization work begins today
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవ పనులకు ఈ రోజు (సోమవారం) శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా రూ.7,360 కోట్లతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువులను మంచినీటితో నింపాలన్న ఉద్దేశంతో చేపట్టిన గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్-2, 3 పథకాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు ఓఆర్‌ఆర్ ఫేజ్-2లోని ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం చేపట్టిన ప్రాజెక్టులో నిర్మించిన 15 కొత్త రిజర్మాయర్లను కూడా రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కాగా, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో చేపట్టనున్నారు. దీని కోసం ప్రభుత్వం 40 శాతం పెట్టుబడి పెడుతుండగా, కాంట్రాక్టు సంస్థ 60 శాతం నిధులను సమకూర్చుకోనుంది.
ఇది కూడా చూడండి:Anuparna Roy : వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అనుపర్ణ రాయ్ సరికొత్త రికార్డ్
పనులు ప్రారంభించిన నుంచి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించనున్నారు. దానిలో మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీల నీటిని కేటాయించి.. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నింపుతారు. మిగతా 17.5 టీఎంసీలను హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు వినియెగిస్తారు. నీటి తరలింపు మార్గం మధ్యలో ఉన్న 7 చెరువులను కూడా ఈ నీటితో నింపుతారు. 2027 డిసెంబరు నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు, ప్రతిరోజూ నల్లా నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ఎంచుకుంది.
Also Read: ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఐటీ..కాపాడుకుంటామన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఓఆర్‌ఆర్ ఫేజ్-2లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయింది. జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్ పరిధిలోని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, గ్రామపంచాయతీలకు తాగునీరు అందించే లక్ష్యంతో రూ.1,200 కోట్లతో ఈ ప్రాజెక్టు ను ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 71 రిజర్వాయర్లను నిర్మించారు.. వీటిలో 15 కొత్త రిజర్వాయర్లను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభిస్తారు. వీటి ద్వారా సరూర్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, మేడ్చల్, కుత్భుల్లాపూర్, ఆర్‌సీ పురం, పటాన్‌చెరు, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, కీసర, రాజేంద్రనగర్, షామీర్‌పేట, బొల్లారం సహా 14 మండల్లాల్లోని 25 లక్షల మందికి తాగునీరు అందే అవకాశం ఉంది. మరోవైపు కోకాపేట లేఅవుట్ సమగ్ర అభివృద్ధిలో భాగంగా నియోపోలిస్ సెజ్‌కు తాగునీరు, మురుగునీటి వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.298 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుకు కూడా సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: దేశంలోని ఆలయాలన్నీ క్లోజ్..కానీ ఆ రెండు మాత్రం ఓపెన్..ఎందుకో తెలుసా?