Mancherial District : యువకుడి ప్రాణం తీసిన లోన్‌యాప్.. ఉరేసుకొని ఆత్మహత్య
మంచిర్యాలలో లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్(29) ఆర్థిక ఇబ్బందులతో లోన్యాప్లో రుణం తీసుకున్నాడు. ఒక నెల వాయిదా చెల్లించడం ఆలస్యం కావడంతో నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. మనస్థాపానికి గురైన శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.