Mega Heroes: అబ్బా ఫ్రేమ్ అదిరింది.. జిమ్ లో మెగా హీరోల రచ్చ! వైరలవుతున్న పిక్

మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పిక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇందులో రామ్ చరణ్, వరుణ్, సాయి ధరమ్ తేజ్ ముగ్గురు మెగా హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.

New Update
mega heroes

mega heroes

Mega Heroes: మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పిక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇందులో రామ్ చరణ్, వరుణ్, సాయి ధరమ్ తేజ్ ముగ్గురు మెగా హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. జిమ్ చేసిన అనంతరం ముగ్గురు కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోను వరుణ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ముగ్గురు మెగా హీరోలను ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ పిక్ చూసిన వారంతా ఫైర్ ఇమేజీస్ తో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'పిక్ ఆఫ్ ది' డే ఫొటోను వైరల్ చేస్తున్నారు. రామ్ చరణ్ కండలు తిరిగిన బాడీతో స్టన్నింగ్ గా కనిపిస్తున్నాడు. తన రాబోయే చిత్రం 'పెద్ది' కోసం చరణ్ జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు.  ఈ మధ్య కూడా చరణ్ జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఓ పిక్ షేర్ చేయగా.. నెట్టింట ఫుల్ వైరల్ అయ్యింది.  గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  చరణ్ ఒక పల్లెటూరి యువకుడిగా, స్పోర్ట్స్ మెన్ గా కనిపించబోతున్నాడు. సో ఆ క్యారెక్టర్ కి తగ్గట్లుగా బాడీని బిల్డ్ చేస్తున్నారు.

'ఫస్ట్ షాట్' వీడియో

ఇదిలా ఉంటే.. ఇప్పటికే  పెద్ది 'ఫస్ట్ షాట్' అంటూ మూవీ నుంచి  విడుదలైన చిన్న గ్లిమ్ప్స్ వీడియో సూపర్ బజ్ క్రియేట్ చేసింది. ఇందులో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ కనిపిస్తూ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాడు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివరాజ్ కుమార్ గౌర్నాయుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న 'పెద్ది' వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్స్ లో విడుదల కానుంది.  అయితే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా మెరవనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ తో కలిసి స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో 'ఊ అంటావా మావ' స్పెషల్ సాంగ్ తో సంచలనం సృష్టించిన సామ్.. ఇప్పుడు ఏ రేంజ్ ఆకట్టుకోనుందా అని ఆసక్తిగా ఉన్నారు ఫ్యాన్స్. 'రంగస్థలం' తర్వాత సామ్- చరణ్ కలిసి చేయబోతున్న రెండవ ప్రాజెక్ట్ ఇది. 

Also Read: Kayadu Lohar: బ్లాక్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తున్న డ్రాగన్ బ్యూటీ.. ఒక్క ఫొటో చూస్తే కుర్రాళ్లు ఫ్లాటే!

Advertisment
తాజా కథనాలు