/rtv/media/media_files/2025/02/28/2tei4ecd3eWoOLx4sena.jpg)
kavith nagarkarnool Photograph: (kavith nagarkarnool)
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు టైం వస్తుంది.. అప్పుడు వాళ్ల సంగతి చెప్తామని కాంగ్రెస్ లీడర్లకు వార్నింగ్ ఇచ్చారు ఆమె. ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నా.. కచ్చితంగా పింక్ బుక్ మైంటైన్ చేస్తామని బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ఎంత పెద్ద నాయకులైనా, అధికారులనైనా సరే వారి పేర్లు పింక్ బుక్‌లో రాసుకొని అంతకంతా చెల్లిస్తామని కల్వకుంట్ల కవిత అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా సింగోటంలో జరిగిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు.
Also read: SLBC: మంత్రుల చేపల కూర విందు.. కేటీఆర్ సంచలన ట్వీట్!
మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారని కవిత ఆరోపించింది. చిన్న రాజకీయ విమర్శ చేసినా, ప్రశ్నించినా కాంగ్రెస్ లీడర్లు అక్రమ కేసులు పెట్టిస్తున్నారని సిరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. పింక్ బుక్‌లో అందరి చిట్టా రాసుకుంటామని చెప్పుకొచ్చారు.
Also read: కరీంనగర్‌లో పోలింగ్ సిబ్బంది బస్సుకు ప్రమాదం.. 20 మందికి గాయాలు
శ్రీధర్ రెడ్డి అనే కార్యకర్తను దారుణంగా చంపేసినప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేయడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు హంతకులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. తమ మీటింగు కోసం ఫ్లెక్సీలు కడితే పరమేశ్వర్ అనే కార్యకర్తపై జూపల్లి దాడి చేయించారని ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి జూపల్లి కృష్ణారావు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తున్నారు. ఈ ప్రాంతానికి ఆయన టూరిస్ట్ మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారని కవిత ప్రశ్నించారు.