/rtv/media/media_files/2025/03/13/AiT4II7PtpPp5D2JO3at.jpg)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ఆకాక్షించారు. కవితకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం కోరారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ట్వీట్ చేయనప్పటికీ సీఎంవో నుంచి ఈ ట్వీట్ వెలువడింది.
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా
1978 మార్చి 13వ తేదీన జన్మించిన కవిత ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ ఏర్పడ్డాక నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు. 2023 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కవిత దేవన్‌పల్లి అనిల్ ను పెళ్లి చేసుకోగా వారికి ఇద్దరు కుమారులు. వారు ఆదిత్య,ఆర్య ఉన్నారు.
శాసనమండలి సభ్యులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.… pic.twitter.com/qNXpOe04oa
— Telangana CMO (@TelanganaCMO) March 13, 2025