Paris: బట్టలు లేకుండా రోడ్లెక్కి మహిళల నిరసన.. ఎందుకంటే?

పారిస్‌లో 40 మంది FEMEN కార్యకర్తలు టాప్‌లెస్‌తో రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. యూరప్ దేశాల్లో పాసిజానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న ఆందోళన చేపట్టారు. అమెరికా, రష్యా దేశాలు ప్రపంచ హింసకు కారణమవుతున్నాయని FEMEN కార్యకర్తలు ఆరోపించారు.

New Update
Paris Topless

Paris Topless Photograph: (Paris Topless)

స్వేచ్ఛకు మారుపేరుగా ఫ్రెంచ్ విప్లవం గురించి చెప్పుకుంటాము. 1789లో ఫ్రెంచ్ చక్రవర్తిపై వచ్చిన తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. చరిత్రలో అదో మైళురాయి. ఎన్నో దేశాల స్వాతంత్ర్య పోరాటాలకు నిదర్శనం. అందమైన పారిస్ నగరంలో ఆడవాళ్లు అర్థనగ్నంగా ఆందోళనకు దిగారు. అది కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు.. 40 మంది FEMEN కార్యకర్తలు పారిస్‌లో టాప్‌లెస్ (పై వస్త్రం ధరించకుండా) నిరసన తెలిపారు. వారి శరీరంపై అమెరికా, రష్యా జాతీయ జెండాలు ముద్రించుకొని, తలకు టోపీ పెట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ మహిళా కార్యకర్తలు ఒంటిపై పాసిస్ట్ అని రాసుకున్నారు.

Also read: Holi : హోలీ రోజున పోలీసుల ఆంక్షలు.. ఇలా చేస్తే పోలీస్ కేసు ఫైల్

యూరప్ ఖండంలో పాసిస్ట్ సిద్ధాంతాన్ని.. స్త్రీలను అణిచివేయడాన్ని వారు వ్యతిరేఖిస్తూ ఆంధోళన చేపట్టారు. అమెరికా, రష్యా దేశాలు అధిపత్యంతో పాసిజాన్ని రెచ్చగొట్టి హింసకు ప్రేరేపిస్తున్నాయని వారు ఆరోపించారు. పాసిస్ట్ కాదు, స్వీవాద యూరప్ కావాలని డిమాండ్ చేశారు. నిజానికి పారిస్ నగరంలో ఇలా నిరసనలు వ్యక్తం చేయడం మొదటి సారికాదు. గతేడాది నవంబర్ 25న కూడా మహిళలు ఇలానే రోడ్డెక్కారు.

Also read: Holi Effect: మసీదులకు పరదాలు.. ఎక్కడో తెలుసా..?

వారి ఆవేధన ఏంటంటే.. పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేఖంగా femen సంస్థ పోరాడుతోంది. అంతర్జాతీయంగా స్త్రీలపై జరుగుతున్న హింసను తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్, సిరియా, ఇరాక్ లాంటి దేశాల్లో హింసకు కారణం అమెరికా, రష్యాలే అని వారన్నారు. రెండు దేశాల అధికార దాహానికి ఎన్నో దేశాలు యుద్ధాలకు దిగి నష్టపోతున్నాయని అన్నారు. ట్రంప్, మస్క్ ప్రపంచంలో అన్ని దేశాల్లో మహిళలను చిన్న చూపు చూస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. స్త్రీలను అణిచివేసే విధాలను ఈ రెండు దేశాలు అవలంభిస్తున్నాయని ఆవేదన చెందారు మహిళా కార్యకర్తలు.

Advertisment
తాజా కథనాలు