/rtv/media/media_files/2025/09/13/rajasingh-2025-09-13-20-23-51.jpg)
భారత్-పాక్ మ్యాచ్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్-పాక్ మ్యాచ్‌ను బై కాట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మ్యాచ్ ఆడకపోతేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో BCCI పెద్దలు మరోసారి ఆలోచించాలని కోరారు. పహల్గామ్ దాడిని భారత్ మరిచిపోలేదన్న రాజాసింగ్.. యావత్ భారత్ మ్యాచ్‌ని వ్యతిరేకిస్తోందని చెప్పారు.
శివసేన నేత ఉద్ధవ్ థాకరే ఇప్పటికే పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడడం దేశ వ్యతిరేకం అని విమర్శించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత, ఆ దేశంతో క్రికెట్ సంబంధాలను కొనసాగించకూడదని శివసేన (యుబిటి) వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే బిజెపి, శివసేన (యుబిటి) మధ్య ఈ మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ రాజకీయ ఘర్షణ క్రికెట్ మ్యాచ్‌కు మరింత ఉద్రిక్తతను పెంచింది. కాగా ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 14న కీలక మ్యాచ్ జరగనుంది. రాజకీయ, ఉగ్రవాద ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదు. అయితే, ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్లలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి.
ఇప్పటి వరకు 16 సార్లు పోటీ
ఇక భారత్ తమ మొదటి మ్యాచ్‌లో యూఏఈని 9 వికెట్ల తేడాతో సునాయాసంగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించి, యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేసింది. పాకిస్తాన్ తమ మొదటి మ్యాచ్‌లో ఒమన్‌పై 93 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వారి బ్యాటింగ్ , బౌలింగ్ రెండూ బలమైన ప్రదర్శన చేశాయి. భారత్ , పాకిస్తాన్ జట్లు ఆసియా కప్‌లో ఇప్పటి వరకు 16 సార్లు తలపడ్డాయి. ఈ రికార్డులలో భారత్ 9 సార్లు గెలవగా, పాకిస్తాన్ 6 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. అయితే, ప్రస్తుత ఫామ్, జట్ల బలం ఆధారంగా చూస్తే, ఇది ఇరు జట్ల మధ్య ఒక హోరాహోరీ పోరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్ ఫలితం గ్రూప్ టాప్ పొజిషన్‌ను నిర్ణయించడంలో కీలకం కానుంది.